మంగళవారం 20 అక్టోబర్ 2020
Nizamabad - Aug 28, 2020 , 02:36:23

ఈడబ్ల్యూఐడీసీ ఏఈ నాగేశ్వర్‌రావు సస్పెన్షన్‌

ఈడబ్ల్యూఐడీసీ ఏఈ నాగేశ్వర్‌రావు సస్పెన్షన్‌

  • l పనులకు, రికార్డులకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించిన కలెక్టర్‌
  • l అధికారుల తీరుపై ఆగ్రహం

బోధన్‌: తెలంగాణ రాష్ట్ర విద్య, సంక్షేమం మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ ఈడబ్ల్యూఐడీసీ) నిజామాబాద్‌ డివిజన్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ నాగేశ్వర్‌రావుపై కలెక్టర్‌ నారాయణరెడ్డి సస్పెన్షన్‌ వేటువేశారు. బోధన్‌ పట్టణ శివారులోని పాండుఫారం ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న బాలికల రెసిడెన్షియల్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌ను గురువారం ఆయన పరిశీలించారు. భవన సముదాయంలో చేపట్టిన పనులకు, రికార్డుల్లో నమోదు చేసిన కొలతలకు మధ్య భారీ తేడా ఉండడాన్ని గుర్తించారు. కొన్ని పనులు పూర్తికాకుండానే నిధులను విడుదలచేయాలని ఏఈ ప్రతిపాదనలు పంపించారని, పూర్తిచేసిన పనులకు సంబంధించిన కొలతల్లో భారీగా వ్యత్యాసం చూపుతూ రికార్డు చేశారని కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తంచేశా రు. తప్పుదోవ పట్టించారని సంబంధిత ఏఈ నాగేశ్వర్‌రావును సస్పెండ్‌చేస్తూ తదుపరి విచారణకు కలెక్టర్‌ ఆదేశాలు జారీచేశారు. విధులను సక్రమంగా నిర్వర్తించనివారిపై చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. కలెక్టర్‌ వెంట బోధన్‌ ఆర్డీవో రాజేశ్వర్‌ ఉన్నారు. 

సంబంధిత అధికారులకు మెమోలు 

పాండుఫారంలో నిర్మాణంలో ఉన్న మైనార్టీ గురుకుల పాఠశాల కాంప్లెక్స్‌ నిర్మాణ పనుల్లో అవకతవకలకు సంబంధించి ఏఈ నాగేశ్వర్‌రావును సస్పెండ్‌చేసిన కలెక్టర్‌ సంబంధిత అధికారులకు మెమోలు జారీచేశారు. టీఎస్‌ ఈడబ్ల్యూఐడీసీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ చక్రపాణి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ అంజిరెడ్డి, జిల్లా మైనార్టీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఆర్‌.రతన్‌కు మెమోలు జారీ అయ్యాయి.


logo