గురువారం 22 అక్టోబర్ 2020
Nizamabad - Aug 27, 2020 , 00:28:48

వ్యాధులకు ‘మాస్కు’

వ్యాధులకు ‘మాస్కు’

  • lతగ్గిన సీజనల్‌ వ్యాధులు
  • lఅంటువ్యాధులు మటుమాయం
  • lవైరస్‌, బ్యాక్టీరియాలు ఖతం
  • lమాస్కు వాడకంతో     చేకూరుతున్న ప్రయోజనాలు

ఖలీల్‌వాడి  కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరిస్తున్నారు. మాస్కు వాడకం ఇలాగే కొనసాగితే అంటువ్యాధులు, సీజనల్‌ వ్యాధులు పత్తాలేకుండా పోతాయని వైద్యులు అంటున్నారు. ముక్కు, నోటి ద్వారా వ్యాపించే ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్‌లు అంతరించి వ్యాధుల తీవ్రత తగ్గిందని చెబుతున్నారు. వాతావరణ మార్పు ల కారణంగా వచ్చే సీజనల్‌ వ్యాధులబారిన పడకుండా మాస్కులు రక్షిస్తున్నాయి. 

తగ్గిన వైరస్‌ వ్యాప్తి ..

ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే అంటువ్యాధుల్లో టీబీ ముఖ్యమైనది. తుమ్మడం, దగ్గడం ద్వారా టీబీ తొందరగా వ్యాపిస్తుంది. కొవిడ్‌కు వైరస్‌ కారణమైతే.. బ్యాక్టీరియాతో టీబీ వస్తుంది. ప్రస్తుతం బ్యాక్టీరియాను కంట్రోల్‌ చేసే మందులు అందుబాటులో ఉండడంతో టీబీతో ప్రమాదం లేదు. కానీ వైరస్‌ను నివారించేందుకు మందులు లేవు. కరోనాతో ప్రాణనష్టం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం, భౌతికదూరం పాటిస్తుండడంతో ఒకరి నుంచి మరొకరి సీజనల్‌ వ్యాధులు సంక్రమించే ముప్పు పూర్తిగా తగ్గింది. గత సంవత్సరం డెంగీ, మలేరియా, చికున్‌గున్యా జ్వరాల వ్యాప్తి అధికంగా ఉండగా.. ఈ సారి తక్కువ సంఖ్యలోనే కేసులు నమోదయ్యాయి.

అంటువ్యాధులు మటుమాయం

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడంతో ప్రతి ఒక్కరూ మాస్కు ధరిస్తున్నారు. భౌతికదూరం పాటిస్తున్నారు. దీంతో ప్రజలు కాలుష్యం బారి నుంచి తప్పించుకొని ఆరోగ్యంగా ఉంటున్నారు. వర్షాకాలంలో జిల్లా కేంద్ర దవాఖానకు రోజూ 1500 మంది వరకు అవుట్‌ పేషెంట్లు వచ్చేవారు. ప్రస్తుతం వారి సంఖ్య పదుల్లో ఉంటోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి సీజనల్‌ వ్యాధుల ప్రభావం తగ్గిందనే చెప్పొచ్చు. 

దరి చేరని సీజనల్‌ వ్యాధులు

కరోనా పుణ్యమా అని ప్రతి ఇంట్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, భౌతికదూరం పాటించడం, మాస్కు ధరించడం అలవాటుగా మారిపోయింది. తరచూ చేతులు శుభ్రం చేసుకోవడంతో బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్లే అవకాశాలు తగ్గాయి. దీంతో వ్యాధుల ముప్పు తప్పుతోంది.  


logo