గురువారం 22 అక్టోబర్ 2020
Nizamabad - Aug 26, 2020 , 03:26:00

మున్సిపాలిటీల్లో రెవెన్యూ మేళాలు

మున్సిపాలిటీల్లో రెవెన్యూ మేళాలు

ఆర్మూర్‌ : మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన బకాయిలను సెటిల్‌ చేసుకునేందుకు, ఒకే విడుతలో ఆయా ఇండ్ల యజమానులు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ సందర్భంగా నిజామాబాద్‌ జిల్లాలోని నగర కార్పొరేషన్‌తో పాటు ఆర్మూర్‌, భీమ్‌గల్‌, బోధన్‌ మున్సిపాలిటీల్లో రెవెన్యూ మేళాలను నిర్వహించి ఆయా మున్సిపాలిటీల్లోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మున్సిపాలిటీల్లో పేరుకపోయిన ఇంటి పన్ను బకాయిలు ఒకే విడుతలో చెల్లించేలా సెటిల్‌మెంట్‌ చేసుకునేందుకు ప్రభుత్వం ఈ మేళా ద్వారా అవకాశం కల్పిస్తున్నది. పెండింగ్‌లో ఉన్న ఇంటి పన్నుపై 90శాతం వడ్డీ రాయితీ కల్పిస్తూ మున్సిపల్‌ శాఖ ఉత్తర్వులను కూడా జారీ చేసింది. ఆయా మున్సిపాలిటీల్లో అధికారులు కరపత్రాలు, మీడియా సహకారంతో ప్రభుత్వం కల్పించిన ఒకేసారి చెల్లించే ఆస్తి పన్ను విషయంపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బకాయి ఉన్న ఇంటి పన్నును సెప్టెంబర్‌ 15వ తేదీలోగా చెల్లించే అవకాశం ఉందని మున్సిపల్‌ అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. 

జిల్లాలోని నిజామాబాద్‌ కార్పొరేషన్‌తో పాటు ఆర్మూర్‌, భీమ్‌గల్‌, బోధన్‌ మున్సిపాలిటీల్లో పేరుకపోయిన బకాయిల వసూళ్లకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇంటి పన్నుల బకాయిల కోసం ప్రభుత్వం ఒకే విడుత చెల్లించే అవకాశాన్ని కల్పిస్తున్నది. ఎవరైనా బకాయిలను ఒకే విడుతలో చెల్లిస్తే వడ్డీలో 90 శాతం మాఫీ చేస్తున్నట్లు అధికారులు ప్రకటిస్తున్నారు. బకాయిదారులు కేవలం పది శాతం వడ్డీని చెల్లిస్తే సరిపోతుంది. 

బకాయిలు ఇలా.. 

నిజామాబాద్‌ నగర కార్పొరేషన్‌లో రూ.6,557.89 లక్ష లు, బోధన్‌ మున్సిపాలిటీలో రూ.1,089.43 లక్షలు, భీమ్‌గ ల్‌ మున్సిపాలిటీలో రూ.130.17 లక్షలు, ఆర్మూ ర్‌ మున్సిపాలిటీలో రూ.97.51 లక్షల బకాయిలు ఉన్నా యి. నగర కార్పొరేషన్‌తో సహా ఏ ఒక్క మున్సిపాలిటీలో కూడా వంద శాతం  ఆస్తి పన్ను వసూలు కాలేదు. కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీల్లో పన్ను బకాయిలను సెప్టెంబర్‌ 15వ తేదీ వరకు చెల్లించే వీలు ఉంది. logo