గురువారం 29 అక్టోబర్ 2020
Nizamabad - Aug 22, 2020 , 00:40:10

విస్తృతంగా కరోనా పరీక్షలు

విస్తృతంగా కరోనా పరీక్షలు

నమస్తే తెలంగాణ యంత్రాంగం: ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక  చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా  విస్తృతంగా టెస్టులు చేసేందుకు సిద్ధమైంది. పట్టణాల్లో విజృంభించిన మహమ్మారి ప్రస్తుతం పల్లెలకూ పాకడంతో ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కేంద్రాల సంఖ్యను పెంచారు. అన్ని పీహెచ్‌సీల్లో ఇప్పటికే ర్యాపిడ్‌ టెస్టులు చేస్తుండగా.. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రతి మండలంలో కొవిడ్‌ టెస్టింగ్‌ కేంద్రాల సంఖ్యను పెంచారు. ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో శుక్రవారం కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఇందల్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఐదు ఉపకేంద్రాల్లో టెస్టులు నిర్వహిస్తున్నారు. పీహెచ్‌సీలో 32 మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌, ఎల్లారెడ్డిపల్లిలో 14 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి, డిచ్‌పల్లిలో 50 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి,  ధర్మారం(బీ)లో 20 మందికి నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు మెడికల్‌ ఆఫీసర్లు బాపురావు, శుభాకర్‌, హెచ్‌ఈవో శంకర్‌, సూపర్‌వైజర్లు తెలిపారు. రాంపూర్‌లో నలుగురికి పరీక్షలు చేయగా అందరికీ నెగెటివ్‌గా వచ్చిందని వివరించారు. మోపాల్‌ మండల కేంద్రంతోపాటు బోర్గాం, సారంగాపూర్‌ గ్రామాల్లో పరీక్షా కేంద్రాలను ప్రారంభించారు.  నగర శివారులోని సారంగాపూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో కొవిడ్‌ పరీక్షా కేంద్రాన్ని తహసీల్దార్‌ ప్రశాంత్‌కుమార్‌, ముదక్‌పల్లి పీహెచ్‌సీలో టెస్టింగ్‌ సెంటర్‌ను వైద్యాధికారి నవీన్‌కుమార్‌  ప్రారంభించారు. తొలిరోజు పది మందికి టెస్టులు చేయగా అందరికీ నెగెటివ్‌గా వచ్చింది. ధర్పల్లి మండల కేంద్రంతోపాటు మండంలోని దుబ్బాక, రామడుగు, హోన్నాజిపేట్‌ గ్రామాల్లో కరోనా నిర్ధారణ కేంద్రాలను ప్రారంభించినట్లు  ఎంపీపీ నల్ల సారిక తెలిపారు. మండలంలో మొత్తం 99 మందికి టెస్టులు చేయగా  అటవీ బీట్‌ అధికారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఇన్‌చార్జి వైద్యుడు మోహన్‌ తెలిపారు. సిరికొండ మండలంలోని న్యావనంది, గడ్కోల్‌, సిరికొండ గ్రామాల్లో కొవిడ్‌ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి 42 మందికి ర్యాపిడ్‌ టెస్టులు చేశారు. ఇందులో ఇద్దరికి పాజిటివ్‌గా వచినట్లు వైద్యాధికారి మోహన్‌ తెలిపారు.  

ఆర్మూర్‌ పట్టణ పరిధిలోని సామాజిక వైద్య ఆరోగ్య కేంద్రం, మామిడిపల్లి, పెర్కిట్‌తోపాటు మండలంలోని దేగాం, ఇస్సాపల్లి, పిప్రి గ్రామాల్లో కరోనా టెస్టులు ప్రారంభించినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ శైలజ, ఎంపీడీవో గోపీబాబు తెలిపారు. మొత్తం 138 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 30 మందికి పాజిటివ్‌గా వచ్చినట్లు వైద్యాధికారిణి అయేషా ఫిర్దౌస్‌ తెలిపారు.  మోర్తాడ్‌ మండలంలోని దొన్కల్‌, సుంకెట్‌, మోర్తాడ్‌ సీహెచ్‌సీ, ఉన్నతపాఠశాలలో కొవిడ్‌ టెస్టింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్‌ శ్రీధర్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి   తెలిపారు. 34 టెస్టులు చేయగా ఐదు పాజిటివ్‌గా వచ్చినట్లు డాక్టర్‌ రవికుమార్‌ తెలిపారు. ఏర్గట్ల ప్రభుత్వ దవాఖానలో కొవిడ్‌ టెస్టింగ్‌ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తహసీల్దార్‌ సురేశ్‌, వైద్యాధికారిణి అంబిక తెలిపారు. తొలిరోజు 35 టెస్టులు చేయగా అన్నీ నెగెటివ్‌ వచ్చాయని వారు తెలిపారు. వేల్పూర్‌ మండలంలో 83 కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా 24 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు మెడికల్‌ ఆఫీసర్‌ అశోక్‌ తెలిపారు. మాక్లూర్‌ మండల కేంద్రంతోపాటు కల్లెడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొత్తం 118 టెస్టులు నిర్వహించగా 14 మందికి పాజిటివ్‌గా  వచ్చినట్లు వైద్యాధికారి సికిందర్‌ నాయక్‌ తెలిపారు. కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లి పీహెచ్‌సీ పరిధిలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యుడు రతన్‌ సింగ్‌ తెలిపారు. బషీరాబాద్‌లో ఇద్దరికి, హాసాకొత్తూర్‌లో నలుగురికి, చౌట్‌పల్లిలో ఒక్కరికి పాజిటివ్‌గా వచ్చినట్లు తెలిపారు. బాల్కొండలో 28 మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. ముప్కాల్‌ మండలం రెంజర్లలో 98 మందికి పరీక్షలు నిర్వహించగా 11 మందికి పాజిటివ్‌గా వచ్చినట్లు డాక్టర్‌ సతీశ్‌ పేర్కొన్నారు. 

బోధన్‌ మండలంలోని పెగడాపల్లి పీహెచ్‌సీలో కరోనా పరీక్షా కేంద్రాన్ని తహసీల్దార్‌ గఫార్‌మియా ప్రారంభించారు. రుద్రూర్‌ పీహెచ్‌సీ పరిధిలో మూడు కరోనా టెస్టుల కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వైద్యాధికారి దిలీప్‌ తెలిపారు.   బోధన్‌లోని ప్రభుత్వ దవాఖానలో 66 మందికి పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్‌, పాన్‌గల్లీ ఆరోగ్య కేంద్రంలో 71మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి, రాకాసీపేట్‌ ఆరోగ్య కేంద్రంలో 44 మందికి పరీక్షలు నిర్వహించగా ఎనిమిది మందికి పాజిటివ్‌గా తేలిందని వైద్యాధికారులు తెలిపారు. నవీపేట మండలంలో 63 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్‌గా వచ్చిందని అధికారులు తెలిపారు. రెంజల్‌ మండలంలోని సాటాపూర్‌, దూపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు చేయగా నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారిణి క్రిస్టినా తెలిపారు. ఎడపల్లి పీహెచ్‌సీలో 96 పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. కోటగిరి మండలంలో నిర్వహించిన పరీక్షల్లో తొమ్మిది మందికి పాజిటివ్‌ వచ్చిందని అధికారులు తెలిపారు. చందూర్‌ మండలంలో 25 మంది కరోనా టెస్టులు చేయగా ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారిణి స్వప్న తెలిపారు. 


logo