గురువారం 29 అక్టోబర్ 2020
Nizamabad - Aug 21, 2020 , 02:15:14

రంగనాయక శతకానికి రాష్ట్రస్థాయి పురస్కారం

రంగనాయక శతకానికి రాష్ట్రస్థాయి పురస్కారం

ఆర్మూర్‌ : మండలంలోని మంథని గ్రామ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థినులు రచించిన రంగనాయక శతకానికి రాష్ట్రస్థాయి పురస్కారం లభించిం ది. ప్రతి ఏటా బాలల సాహిత్యానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా అవార్డులు అందజేసే బ్రహ్మయ్య బాలమణి బాలసాహిత్య పురస్కారానికి రంగనాయక శతకం పుస్తకం ఎంపికయ్యింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది పాఠశాలలు ఎంపిక కాగా.. జిల్లా నుంచి రెండు పాఠశాలలు ఎంపికయ్యాయని, అందులో మంథని పాఠశాల ఒకటని తెలుగు అధ్యాపకుడు కోకిల నాగరాజు తెలిపారు. తమ పాఠశాల విద్యార్థులు రాసిన శతకానికి పురస్కారం రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల హెచ్‌ఎం శ్యామలాబాయి, సర్పంచుల ఫోరం ఆర్మూర్‌ మండల అధ్యక్షుడు పుట్టింటి లింబారెడ్డి, మంథని గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు, వీడీసీ బాధ్యులు అభినందించారు.


logo