మంగళవారం 20 అక్టోబర్ 2020
Nizamabad - Aug 20, 2020 , 03:34:25

ఏడుగురిపై కేసు

ఏడుగురిపై కేసు

మంచిర్యాలటౌన్‌: రేషన్‌ బియ్యం అక్రమ రవాణా కేసులో ఏడుగురిపై కేసు నమోదు చేసి, 220 క్వింటాళ్ల బియ్యాన్ని, రూ.1.80 లక్షలు నగదు, లారీని స్వాధీనం చేసుకున్నట్లు మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మంచిర్యాల పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మంచిర్యాల పట్టణంలో మంగళవారం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా, మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న లారీ అనుమానాస్పదంగా కనిపించడం తో పోలీసులు ఆపినట్లు తెలిపారు. డ్రైవర్‌, క్లీనర్‌ను విచారించగా, జైనూర్‌కు చెందిన షాకీర్‌ ఆదేశాల మేరకు దం డేపల్లి మండలం నెల్కి వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన కొత్త శ్రావణ్‌కుమార్‌, లక్షెట్టిపేటలో ఉండే అతడి బావమరిది గంప రమేశ్‌ వద్ద 200 క్వింటాళ్ల బియ్యాన్ని లోడ్‌ చేసుకుని మహారాష్ట్రలోని గోందియాకు తరలించడానికి వెళ్తున్నట్లు వారు వివరించారు. అనంతరం శ్రావణ్‌కుమార్‌, గంప రమేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించామని, సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో వీరిరువురు దండేపల్లికి చెందిన పాత శ్రీను, మేదరిపేటకు చెందిన డిష్‌ శ్రీను, రెబ్బనపెల్లికి చెందిన భువనగిరి సంపత్‌, మామిడిపల్లికి చెందిన తెనుగు మల్లేశంను ఏజెంట్లుగా పెట్టుకుని చుట్టు పక్కల గ్రామాల్లో రేషన్‌ బియ్యాన్ని రూ. 5 నుంచి రూ.7కు కిలో చొప్పున కొనుగోలు చేస్తున్నారని  తెలిపారు. లారీ లోడ్‌కు సరిపడా బి య్యం జమయ్యాక  షాకీర్‌కు సమాచారం అందిస్తే అత ను నకిలీ వేబిల్లులు తయారు చేసి లారీని పంపించి డ బ్బులు అందజేస్తాడని డీసీపీ పేర్కొన్నారు. గతంలో కూ డా శ్రావణ్‌కుమార్‌ నిందితుడని చెప్పారు. అరెస్టయిన వారిలో కొత్త శ్రావణ్‌కుమార్‌, గంప రమేశ్‌, లారీ డ్రైవర్‌ షేక్‌ మొహియుద్దీన్‌ ఉండగా, షాకీర్‌, పాత శ్రీను, డిష్‌శ్రీను, భువనగిరి సంపత్‌, తెనుగు మల్లేశం పరారీలో ఉన్నారని,  వీరిని త్వరలోనే అరెస్టు చేస్తామని డీసీపీ పే ర్కొన్నారు.   పట్టణ సీఐ ముత్తి లింగయ్య, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ ఉన్నారు. 


logo