గురువారం 29 అక్టోబర్ 2020
Nizamabad - Aug 20, 2020 , 03:34:55

ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి

ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి

నిజామాబాద్‌ సిటీ/నవీపేట: వినాయకచవితి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని రూరల్‌ సీఐ శ్రీనాథ్‌రెడ్డి అన్నారు. నగరంలోని ఐదో టౌన్‌ పరిధిలో, నవీపేట పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం వేర్వేరుగా శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేరకే మండపాలను ఏర్పాటు చేయాలని సూచించారు. మండపాల వద్ద కొవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలని, భక్తులు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని, డీజేలకు అనుమతి లేదని వివరించారు.  మండపాల నిర్వాహకులు పోలీస్‌ స్టేషన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని, నిబంధలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఎస్సై జాన్‌రెడ్డి, మత పెద్దలు, కాలనీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నవీపేట సమావేశంలో స్థానిక ఎస్సై యాకూబ్‌, ఎంపీపీ సంగెం శ్రీనివాస్‌, జడ్పీటీసీ నీరడి సవిత, సర్పంచ్‌ శ్రీనివాస్‌, ఉప సర్పంచ్‌ మల్లేశ్‌, మాజీ ఎంపీపీ సూరిబాబు, నాయకులు  పాల్గొన్నారు. 

ఒకే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి..

ఆర్మూర్‌: ఆర్మూర్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో వినాయక ఉత్సవాలపై ఎంపీపీ పస్క నర్సయ్య అధ్యక్షతన సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, వీఆర్‌వోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రాఘవేందర్‌ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామానికొక్కటే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని  సూచించారు. ఇందుకోసం వీడీసీలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు చర్చించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు.  సమావేశంలో తహసీల్దార్‌ సంజీవ్‌రావు, ఎంపీడీవో గోపీబాబు, ఎంపీవో వేజన, నాయబ్‌ తహసీల్దార్‌ లక్ష్మణ్‌, సర్పంచులు గంగాధర్‌, సుమలత, నర్సయ్య, రాజేశ్వర్‌, దయానంద్‌, మధువర్మ పాల్గొన్నారు. 

గ్రామాల్లో మండపాలకు అనుమతి లేదు

ధర్పల్లి : గ్రామాల్లో వినాయక మండపాలకు అనుమతులు లేవని, ఇండ్లల్లోనే విగ్రహాలు ఏర్పాటు చేసుకొని పూజించాలని ఎస్సై పాండేరావు తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ గ్రామాల్లో వినాయక మండపాలను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులివ్వాలని కోరుతూ పలువురు యువకులు బుధవారం సాయంత్రం పోలీస్‌ స్టేషన్‌ తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా మండపాలకు ప్రభుత్వ అనుమతి లేదని, విగ్రహాలను ఐదు రోజుల్లోనే నిమజ్జనం చేయాలని, డీజేలు పెట్టొద్దని యువకులకు సూచించారు. 


logo