శనివారం 24 అక్టోబర్ 2020
Nizamabad - Aug 20, 2020 , 03:34:55

ఉగ్ర గోదావరి

ఉగ్ర గోదావరి

రెంజల్‌ : తెలంగాణ, మహారాష్ట్రలో విస్తారం గా కురుస్తున్న భారీ వ ర్షాలతో వరద  నదిలోకి చేరుతుండడంతో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. ఎగువన ఉన్న మహారాష్ట్రలో కొ న్ని రోజులుగా ఎడతెరి పి లేకుండా వర్షాలు కు రుస్తున్నాయి. దీంతో భారీ స్థాయిలో వరద దిగువకు చేరుతోంది. రెంజల్‌ మండలం కందకుర్తి గోదావరి నదిలో ఉన్న పురాతన శివాలయం చుట్టూ నీళ్లు చేరా యి. గోదావరి నీటి మట్టం గంటగంటకూ పెరుగుతోంది. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే ఆల యం పూర్తిగా మునిగే అవకాశముంది. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జా రీ చేస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులను లోపలి వరకు అనుమతించకుం డా, పుష్కరఘాట్‌ల వద్దే స్నానాలు చేసేలా  ఏర్పాట్లు చేశారు.  


logo