గురువారం 22 అక్టోబర్ 2020
Nizamabad - Aug 18, 2020 , 03:01:04

వెన్నెముకగా నిలుద్దాం..

వెన్నెముకగా నిలుద్దాం..

  • n వెన్నెముక సమస్యతో ఎనిమిదేండ్ల బాలుడి నరకయాతన
  • n కూలీనాలి చేస్తేగానీ ఇల్లు గడవని దుస్థితి
  • n ఆపన్నహస్తం కోసం ఎదురు చూపు
  • n ఆదుకోవాలని తల్లిదండ్రుల వేడుకోలు

బీర్కూర్‌ : అందరు చిన్నారుల్లా ఆడి పాడాల్సిన వయస్సు.. హుషారుగా బడికెళ్లి అక్షరా లు దిద్దాల్సిన బాల్యం.. ‘ఎదగనివ్వకుండా’ ఎదగాయమై పసివాడిని కుంగదీస్తోంది. రేపటి రోజున కుటుంబానికి వెన్నెముకగా నిలవాల్సిన వాడు వెన్నెముక సమస్యతో బాధపడుతున్నాడు. ఎదుగూబొదుగూ లేని జీవితం వెళ్లదీస్తున్న ఆ కుటుంబానికి పెద్ద దెబ్బ పడినైట్లెంది. వైద్యం కోసం లక్షల్లో ఖర్చు చేయాల్సి రావడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. 

బీర్కూర్‌ మండలంలోని కిష్టాపూర్‌ గ్రామానికి చెందిన చాకలి శ్రీనివాస్‌-సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు అర్వింద్‌ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. రెండో కుమారుడు మణితేజ అదే పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నా డు. ఇంతవరకు బాగానే ఉన్నా మణితేజకు వెన్నెముకలో ఎదుగుదల లోపించింది.   కుటుంబ సభ్యులు తమ కుమారుడు ఎదగడం లేదన్న అనుమానంతో హైదరాబాద్‌లోని నిలోఫర్‌ దవాఖానకు తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు క్యాన్సర్‌కు సంబంధించిన వ్యాధి ఉందని చెప్పి పంపించారు. అక్కడి నుంచి నిమ్స్‌ దవాఖానకు, తర్వాత సిటిజన్‌ దవాఖానకు తీసుకెళ్లగా వ్యాధి బయటపడిం ది. బాబు కోలుకొని అందరిలా ఎదగాలంటే రూ.20 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. ఇప్పటి వరకు వైద్యం కోసం రూ.4 లక్షలు ఖర్చు చేశారు. వారికున్న 30 గుంట ల భూమిని అమ్మేశారు. కేవలం వైద్య పరీక్షలకే రూ.50 వేలు కావాలని, ఆరోగ్యశ్రీ కింద రూ.17 లక్షలు వర్తించినా మరో రూ.3 లక్ష లు అవసరం ఉంటుంది. బాబు ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాబుకు ప్రతి నెలా మూడు బాటిళ్ల రక్తం ఎక్కించడం కోసం మూడు వేలు ఖర్చవుతుంది.

 రక్తం ఎక్కించని పక్షంలో బాబు ఒంటిపై బొబ్బలు వచ్చి ఆరోగ్యం క్షీణిస్తుంది. ఈ వ్యాధి ఏడాదిన్నర క్రితం రావడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.50 వేలకు పైగా బాబుకు రక్తం ఎక్కించడం కోసమే ఖర్చు చేశారు. 

మా బాబును కాపాడండి 

మా బాబుకు వచ్చిన వ్యాధి ఏ చిన్నారికీ రాకూడదు. ఇలాంటి వ్యాధి గరీబోల్లకు రావొద్దు. మా బాధను అర్థం చేసుకొని, మమ్మల్ని ఆదుకొని మా బాబును కాపాడాలని వేడుకుంటున్నాం. 

- శ్రీనివాస్‌, సుజాత (సెల్‌ నెం.8367452311)


logo