ఆదివారం 25 అక్టోబర్ 2020
Nizamabad - Aug 17, 2020 , 00:19:58

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

ఖలీల్‌వాడి : నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా అధికారులను ఆదేశించారు. ఈమేరకు ఆయన అధికారులతో కలిసి నగరంలో డివైడర్ల నిర్మాణం, ప్లాంటేషన్‌, రఘునాథ చెరువు వద్ద నిర్మిస్తున్న మినీ ట్యాంక్‌బండ్‌ పనులను ఆదివారం పరిశీలించారు. అనంతరం నగరంలోని క్యాంప్‌ కార్యాలయంలో మున్సిపల్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, మిషన్‌ భగీరథ, నేషనల్‌ హైవే అథారిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. నూతనంగా నిర్మించే డివైడర్ల పనులపై పలు సూచనలు చేశారు. డివైడర్ల మధ్యలో నాటిన మొక్కలు, వాటి పరిరక్షణ కోసం ఐదు జోన్లకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని నగర కమిషనర్‌ను ఆదేశించారు. మొక్కలకు నీరు పట్టేందుకు ట్యాంకర్‌ను ఏర్పా టు చేసుకోవాలని సూచించారు. అవసరం మేర కు నిధులు వాడుకోవాలన్నారు. ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. నగర అభివృద్ధి కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మున్సిపల్‌ కమిషనర్‌ జితేశ్‌ వీ పాటిల్‌, ఇంజినీర్లు సాగర్‌, రషీద్‌, అధికారులు రవిరాజేంద్ర కుమార్‌, నరేశ్‌, అరుణ్‌ తదితరులు పాల్గొన్నారు. logo