బుధవారం 21 అక్టోబర్ 2020
Nizamabad - Aug 16, 2020 , 01:53:52

కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూం ఏర్పాటు

కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూం  ఏర్పాటు

ఇందూరు : జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగినా ఆదుకునేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామని కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు.  కంట్రోల్‌ రూం 24 గంటలు పని చేస్తుందని పేర్కొన్నారు.  వర్షాలతో ఎటువంటి అసౌకర్యం కలిగినా కంట్రోల్‌ రూమ్‌ 08462-220183 ఫోన్‌ నంబర్‌కు లేదా dronzb911 @gmail.com కు మెయిల్‌ ద్వారా తెలియజేయాలని సూచించారు. ముఖ్యంగా ఇరిగేషన్‌ అధికారులు నిరంతరం చెరువులు, కాలువలను పర్యవేక్షిస్తూ, కట్టలు తెగకుండా చూడాలని ఆదేశించారు.  ముందస్తుగా ఇసుక బస్తాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. 

కామారెడ్డిలో అధికారుల సెలవులు రద్దు

కామారెడ్డి: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లా అధికారులకు, సిబ్బందికి సెలవులు రద్దు చేశామని, అందరూ  హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌ ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని తెలిపారు.  7382928649, 73829 29350 హెల్ప్‌లైన్‌ నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. 


logo