సోమవారం 19 అక్టోబర్ 2020
Nizamabad - Aug 16, 2020 , 01:53:53

మత్తడి దుంకుతున్న చెరువులు

మత్తడి దుంకుతున్న చెరువులు

సిరికొండ (ధర్పల్లి)/ మాచారెడ్డి/ లింగంపేట/ కోటగిరి: ధర్పల్లి మండలం మైలారం గ్రామంలోని పెద్ద చెరువు జలకళ సంతరించుకుంది. పూర్తిగా నిండి అలుగు పారుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చే స్తున్నారు.  సిరికొండ మండలం కొండూర్‌ గ్రా మంలోని కప్పల వాగు ఉధృతంగా ప్రవహిస్తుం ది. గతేడాది తాత్కాలికం గా ఏర్పాటు చేసిన వం తెన కొట్టుకుపోయింది. ఇ ది మండల కేంద్రం నుంచి నిజామాబాద్‌ వెళ్లే ప్రధాన రహదారి కావడంతో ప్రయాణికులు గడ్కోల్‌ మీదుగా వెళ్లాలని అధికారులు సూచించారు. తూంపల్లి గ్రామంలో  చెరువులోని నీళ్లు వచ్చే మాటు కాలువ కట్ట  తెగిపోవడంతో పంట పొలాల్లోకి నీరు వచ్చి చేరింది. మాచారెడ్డి మండలంలోని పాల్వంచ గ్రామం వద్ద ఉన్న వాగు నిండుగా ప్రవహిస్తున్నది. పలు గ్రామాల్లోని చెరువులు నిండుకుండలుగా మారాయి. ఎగువ ప్రాంతమైన కామారెడ్డిలో కురుస్తున్న వర్షాలకు  వాగు నిండుగా ప్రవహిస్తుండడంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లింగంపేట మండల కేంద్రంలోని పెద్ద వాగులో నీటి ప్రవాహం పెరిగింది. ఎగువ భాగంలో ఉన్న గాంధారి మండలంలోనూ వర్షాలు కురియడంతో పెద్ద వాగు నీటితో కళకళలాడుతున్నది. పెద్దవాగు నుంచి లింగంపేట చెరువులోకి మత్తడి కాలువ ద్వారా నీరు చేరుకుంటుంది. చెరువులో నీరు రావడంతో ఆయకట్టు కింద వ్యవసాయ పనులు కొనసాగుతున్నాయి.   కోటగిరి  మండలంలో వాగులు, వంకలు పొంగిపొర్లి ప్రవహిస్తున్నాయి. 


logo