శుక్రవారం 23 అక్టోబర్ 2020
Nizamabad - Aug 15, 2020 , 03:43:41

జన బాంధవుడికి ఘన నివాళి

జన బాంధవుడికి ఘన నివాళి

  • l ఘనంగా వేముల సురేందర్‌ రెడ్డి నాల్గవ వర్ధంతి
  • l హాజరైన ప్రముఖులు

వేల్పూర్‌ : రైతు నేత,  రాష్ట్ర హౌసింగ్‌, శాసన సభ వ్యవహారాలు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి  వేము ల ప్రశాంత్‌ రెడ్డి తండ్రి దివంగత  వేముల సురేందర్‌రెడ్డి నాల్గవ వర్ధంతి శుక్రవారం వేల్పూర్‌లోని మం త్రి స్వగృహంలో  నిర్వహించారు. నియోజకవర్గంలోని  ఎంపీపీలు, జడ్పీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు హా జరై సురేందర్‌ రెడ్డికి ఘన నివాళులర్పించారు. ఉదయాన్నే సురేందర్‌రెడ్డి కుమారులు మంత్రి ప్రశాంత్‌రెడ్డి,అజయ్‌ రెడ్డి, కుటుంబ సభ్యులు శ్రాద్ధ కర్మలు నిర్వహించారు. అనంతరం వేల్పూర్‌ ఎక్స్‌రోడ్డులోని సురేందర్‌రెడ్డి విగ్రహం, ఘాట్‌ వద్ద  నివాళులర్పించారు. 

నాన్నగారి ఆశయాలు నెరవేరుస్తున్నా..: ప్రశాంత్‌రెడ్డి

తన తండ్రి సురేందర్‌రెడ్డి ఆశయాలను ఒక్కొక్కటిగా  నెరవేరుస్తున్నానని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి  అన్నా రు.  ఎక్స్‌రోడ్డులోని సురేందర్‌రెడ్డి విగ్రహానికి, అనంతరం ఘాట్‌ వద్ద తన తమ్ముడితో కలిసి నివాళులు అర్పించారు. రైతు సమస్యల పరిష్కారానికి తన తండ్రి ఉద్యమించారన్నారు. తెలంగాణ ఉద్యమ నుంచి స్వరాష్ట్రం వచ్చే వరకు  అప్పటి ఉద్యమ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి  చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో మొదటి నుంచి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ఉద్య మ కాలంలోనే కేసీఆర్‌, తన తండ్రి రైతు సంక్షే మానికి నిరంతరం పరితపించారని, ఇందులో భాగంగానే రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ, ఉచిత కరెంట్‌, సాగు నీరు తదితర సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని  తెలిపారు. అన్నదాతల అభ్యున్నతికి చేపడుతున్న ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చూ సేందుకు రైతు నాయకుడైన ఆయన మన మధ్యలో లేకపోవడం  బాధ కలిగిస్తోందన్నారు. ఆయన కొడుకుగా  ఆయన ఆశయాలను ఒక్కొక్కటిగా నెరవేరు స్తున్నానని వివరించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు కోటపాటి నర్సింహానాయుడు, గోవింద్‌పేట్‌ గంగారెడ్డి, నియోజకవర్గంలోని ఎంపీపీ లు భీమ జమున, సామ పద్మ, శ్రీనివాస్‌, జడ్పీటీసీ బద్దం రవి, వేల్పూర్‌ సర్పంచ్‌ తీగల రాధ, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల కన్వీనర్లు నాగధర్‌, వెంకట్‌రెడ్డి, దాసరి వెంకటేశ్‌,ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములు, రాకేశ్‌ చంద్ర,  మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొట్టాల చిన్నారెడ్డి, ఎంపీటీసీ మొండి మహేశ్‌, ఉపసర్పంచ్‌ పిట్ల సత్యం, నాయకులు సామ మహిపాల్‌, భోజన్నయాదవ్‌, సామ మహేందర్‌, రాజ్‌కుమార్‌  పాల్గొన్నారు.


logo