మంగళవారం 20 అక్టోబర్ 2020
Nizamabad - Aug 15, 2020 , 03:43:41

ప్రజల ఆశీర్వాదంతో మరింత అభివృద్ధి

ప్రజల ఆశీర్వాదంతో మరింత అభివృద్ధి

నిజాంసాగర్‌: ప్రజల ఆశీర్వాదంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని జుక్కల్‌  ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. శుక్రవారం ఆయన  జన్మదినం సందర్భంగా నిజాంసాగర్‌ మండలంలో ఏర్పా టు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.  ప్రజలందరి ఆశీర్వాదంతో ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో నిర్వహించుకోవడంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సీఎం కేసీఆర్‌ హయాంలో నియోజకవర్గంలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రారంభించుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ  చైర్మన్‌ దఫేదార్‌ రాజు, సీనియర్‌ నాయకులు దుర్గారెడ్డి, సీడీసీ చైర్మన్‌ గంగారెడ్డి, విఠల్‌, నర్సింహారెడ్డి, సత్యనారాయణ, రమేశ్‌గౌడ్‌, నారాయణ, రమేశ్‌, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

కుటుంబ సభ్యులతో.. 

ఎమ్మెల్యే హన్మంత్‌షిండే  ముం దుగా ఆయన తన కుటుంబ సభ్యుల మధ్య జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. కరోనా నేపథ్యంలో హంగూ ఆర్భాటలతో వేడుకలను నిర్వహించవద్దని ఒక రోజు ముందే కార్యకర్తలకు సూచించారు. సాయంత్రం నియోజకవర్గానికి వచ్చిన ఆయనకు కార్యకర్తలు, నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 


logo