బుధవారం 28 అక్టోబర్ 2020
Nizamabad - Aug 15, 2020 , 03:43:42

అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్‌లో చేరికలు

అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్‌లో చేరికలు

  • రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌

నిజామాబాద్‌ రూరల్‌ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనూ సీఎం కేసీఆర్‌ నిరాటంకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. శుక్రవారం నిజామాబాద్‌ నగరంలోని ఎమ్మెల్యే స్వగృహంలో జిల్లా మత్స్య సహకార సంఘం డైరెక్టర్‌, కాంగ్రెస్‌ నాయకుడు కోరట్‌పల్లి ఆనంద్‌, మాజీ ఉపసర్పంచ్‌ ముత్యం గంగాధర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే  గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ   అన్ని వర్గాల  సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారని తెలిపారు.  కండ్ల ముందు ఇంత అభివృద్ధి జరుగుతున్నా ప్రతిపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఇందల్వాయి ఎంపీటీసీ సుధాకర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు డి.నర్సయ్య, మారంపల్లి హన్మంత్‌, రాములు, నాగబోయి గంగాధర్‌, బి.రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo