బుధవారం 21 అక్టోబర్ 2020
Nizamabad - Aug 14, 2020 , 01:05:10

విద్యుత్‌ అవసరంలేని లిఫ్ట్‌ ఇరిగేషన్‌

విద్యుత్‌ అవసరంలేని లిఫ్ట్‌ ఇరిగేషన్‌

  • l రూపొందించిన విద్యార్థి మహేందర్‌
  • l రాష్ట్రస్థాయి ‘ఇంటింటా ఇన్నోవేటర్స్‌'కు ఎంపిక
  • l స్వాతంత్య్ర దినోత్సవాన ఆన్‌లైన్‌లో ప్రదర్శన\

ఆర్మూర్‌ : మండలంలోని సుర్భిర్యాల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థి బి.మహేందర్‌ విద్యుత్‌ అవసరం లేని లిఫ్ట్‌ ఇరిగేషన్‌ సిస్టంను రూపొందించాడు. భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడు పసుపుల రఘునాథ్‌ సహకారంతో మహేందర్‌ రూపొందించిన లిఫ్ట్‌ ఇరిగేషన్‌ సిస్టం ఇటీవల రాష్ట్రప్రభుత్వం నిర్వహించిన ‘ఇంటింటా ఇన్నోవేటర్స్‌' రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికైంది. జిల్లా కేంద్రంలో ఈనెల 15వ తేదీన నిర్వహించనున్న స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో భాగంగా ఆన్‌లైన్‌లో దీనిని ప్రదర్శించనున్నారు.  భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడు పసుపుల రఘునాథ్‌ పర్యవేక్షణలో విద్యార్థి మహేందర్‌ విద్యుత్‌ అవసరం లేని లిఫ్ట్‌ ఇరిగేషన్‌ సిస్టంను రూపొందించాడని హెచ్‌ఎం రవీందర్‌ గురువారం తెలిపారు. విద్యార్థితోపాటు ఉపాధ్యాయుడిని సర్పంచ్‌ సవితాగణేశ్‌, వీడీసీ సభ్యు లు, ఎస్‌ఎంసీ చైర్మన్‌ రమేశ్‌, ఉపాధ్యాయులు అభినందించారు. 

లిఫ్ట్‌ఇరిగేషన్‌ సిస్టం పనిచేసేదిలా.. 

కరెంట్‌తో సంబంధం లేకుండా నీటిని ఎత్తిపోసే లిఫ్ట్‌ ఇరిగేషన్‌  సిస్టంను తయారు చేసేందుకు సైకిల్‌ చక్రం, స్టాండ్‌, పైపు, టబ్బులను ఉపయోగించారు. మెట్ట ప్రాంతాల్లో, కొండప్రాంతాల్లో కాలువల ద్వారా వచ్చే నీటిని ఎత్తిపోయడంతోపాటు లోతట్టు ప్రాంతాల్లోని నీటిని ఎంత ఎత్తుకైనా సరఫరా చేయొచ్చు. నీటి ప్రవాహంలో మహేందర్‌ రూపొందించిన లిఫ్ట్‌ ఇరిగేషన్‌ సిస్టంను ఏర్పాటుచేస్త్తే దానికదే తిరుగుతూ నీటిని ఎత్తిపోస్తుంది.


logo