సోమవారం 28 సెప్టెంబర్ 2020
Nizamabad - Aug 14, 2020 , 01:05:12

ఘనంగా శిరిశినహల్‌ జయంతి

ఘనంగా శిరిశినహల్‌ జయంతి

ఇందూరు : నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండలానికి చెందిన తెలంగాణ తొలి శతావధాని శిరిశినహల్‌ కృష్ణమాచార్యుల జయంతి వేడుకను హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్‌ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్‌ నగరంలోని నాందేవ్‌వాడలో ఉన్న ట్రెండ్‌ క్రియేషన్స్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేవేందర్‌ మాట్లాడుతూ కృష్ణమాచార్యులు కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల్లో ఎన్నో శతావధానాలు నిర్వహించారని, కావ్య, నాటక, అలంకార, తిరు మంత్రార్థము, శ్రీవచన భూషణ వ్యాఖ్యానం తదితర గ్రంథాలను, వేదాలను అభ్యసించారని అన్నారు. కోరుట్లలోని ఉభయ వేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా అనేకమంది శిష్యులకు మార్గనిర్దేశం చేశారన్నారు. 40కి పైగా గ్రంథాలు రాశారని, కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతి గీతాలు, హరికథలు రచించడంలో దిట్ట అనిఅన్నారు. కృష్ణమాచార్యులు తెలంగాణ లో అవధాన కళకు బీజంవేసిన వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్‌, కంకణాల రాజేశ్వర్‌, తుంగలపల్లి నరేశ్‌చారి, రాహుల్‌ తదితరులు పాల్గొన్నారు. logo