గురువారం 29 అక్టోబర్ 2020
Nizamabad - Aug 13, 2020 , 01:54:43

ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు ఇందూరు అనుకూలం

ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు ఇందూరు అనుకూలం

  • మంత్రుల సమావేశంలో వేముల ప్రశాంత్‌ రెడ్డి సూచన

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనల మేరకు రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమ ల స్థాపనకు తీసుకోవాల్సిన చర్యలపై హైదరాబాద్‌లో మం త్రుల సమావేశం జరిగింది. తెలంగాణ ఆహార శుద్ధి, లాజిస్టిక్‌ పాలసీలపై చర్చించడానికి, మార్గదర్శకాలను రూపకల్పన చేయడానికి ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ప్రణాళిక బోర్డు వైస్‌ చైర్మన్‌ వినోద్‌ కుమార్‌, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి  హాజరైన ఈ సమావేశంలో నిజామాబాద్‌ జిల్లా అనుకూలతలపై చర్చ జరిగింది. వ్యవసాయ ఆధారిత జిల్లాగా పేరొందిన ఈ ప్రాంతంలో నెలకొల్పాల్సిన పరిశ్రమలపై కేటీఆర్‌ దృష్టికి మంత్రి వేముల తీసుకువచ్చారు. ఈ ప్రాంతం భిన్నమైన పంటల సమాహారమైనందున ఇక్కడి రైతులకు మేలు చేకూర్చేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వేముల వివరించారు. పసుపు, మక్క, సోయా పంటల ఆధారిత పరిశ్రమలను స్థాపించడం ద్వారా ఎలాంటి లాభాలు చేకూరుతాయన్న దానిపైనా చర్చించారు. అందుబాటులో ఉన్న భూమి లభ్యతపైనా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి కేటీఆర్‌కు వివరించగా ఆయ న పరిశ్రమల స్థాపనకు   సుముఖత వ్యక్తం చేశారు.

బాల్కొండలో పసుపు...  లక్కంపల్లిలో మక్క, సోయా పరిశ్రమలు...

మంత్రుల సమావేశంలో నిజామాబాద్‌ జిల్లా భౌగోళిక స్వరూపం, పంటల తీరుతెన్నులు, రైతులకు చేకూర్చాల్సిన ప్రయోజనాలపై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి  వివరించారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో 42 ఎకరాల్లో ఏర్పాటు చేసిన స్పైస్‌ పార్కుకు చు ట్టూ 50 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో లక్ష ఎకరాల పసు పు పంట సాగవుతుందని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి వెల్లడించారు. పసుపు ఆధారిత ప్రాంతమైన ఇక్కడి స్పైస్‌ పార్కులో వాటికి సంబంధించిన పరిశ్రమలనే నెలకొల్పి రై తులకు మేలు చేకూర్చాలని ఆయన కోరారు. ఆర్మూర్‌ ని యోజకవర్గంలోని నందిపేట మండలం లక్కంపల్లి సెజ్‌ లో 200 ఎకరాల్లో సోయా, మక్కజొన్న ఆహార శుద్ధి పరిశ్రల ను ఏర్పాటు చేయాలని కేటీఆర్‌కు వేముల విన్నవించారు. ఇందుకు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సముఖత వ్యక్తం చేయగా మంత్రి వేముల ధన్యవాదాలు తెలియజేశారు.

ముఖ్యమైన సూచనలివీ...

మారుతున్న పంటల సరళిని దృష్టిలో పెట్టుకుని ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించాలి. పౌల్ట్రీ, మాంసం ఉత్పత్తి, చేపల ప్రాసెసింగ్‌ రంగాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచాలి. కొన్ని పనులకు కార్మికుల కొరత ఉంది. ఆయా పనుల్లో యాంత్రీకరణను ప్రోత్సహించాలి. గిరిజన ప్రాంతాల్లో చిన్న ఆహార శుద్ధి పరిశ్రమలను నెలకొల్పాలి. దళిత మహిళా పారిశ్రమిక వేత్తలు ఈ అవకాశాలు అందిపుచ్చుకునేలా చర్యలు తీసుకోవాలి. తెలంగాణ బ్రాం డ్‌ నాణ్యమైన ఉత్పత్తులను ప్రపంచం మొత్తం ఎగుమతి అయ్యేలా చూడాలి. ఆహార కల్తీని అరికట్టి వినియోగదారుడికి నాణ్యమైన ఉత్పత్తులు అందించాలి. పాలు, పాల ఆధారిత ఉత్పత్తులు విస్తృతం చేయాలి. నూనె గింజల ఉత్పత్తిని పెంచే ఆధునిక నూనె మిల్లులకు ప్రోత్సాహం అందించాలి. పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్‌ పరిశ్రమలను స్థాపిస్తే  వృథా తగ్గి రైతులకు లాభం చేకూరుతుంది.


logo