బుధవారం 28 అక్టోబర్ 2020
Nizamabad - Aug 12, 2020 , 02:58:22

ప్రాజెక్టులకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

ప్రాజెక్టులకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

మెండోరా : ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ఎస్సారెస్పీలోకి ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుందని డీఈ జగదీశ్‌ తెలిపారు. ప్రాజెక్టులోకి 14,039  క్యూసెక్కుల వరదవచ్చి చేరుతున్నదని పేర్కొన్నారు. కాకతీయ కాలువకు రెండువేల క్యూసెక్కులు, సరస్వతీ కాలువకు 600 క్యూసెక్కులు, లక్ష్మి కాలువకు 100 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుందన్నారు. మిషన్‌ భగీరథ తాగునీటి అవసరాలకు 152 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్ట్‌ నుంచి అవుట్‌ఫ్లో కింద 3,282 క్యూసెక్కులు పోతుందని డీఈ వివరించారు. ఈ సీజన్‌ ప్రాజెక్టులోకి 24.04 టీఎంసీల వరద వచ్చి చేరిందని తెలిపారు. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90.313 టీఎంసీలు)కాగా మంగళవారం సాయంత్రానికి 1074.70 అడుగుల (39.006 టీఎంసీల) వద్ద  ఉందని చెప్పారు. కాకతీయ కాలువకు 2000 క్యూసెక్కుల నీటితో ఒక టర్బయిన్‌తో 3.9 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోందని డీఈ శ్రీనివాస్‌ తెలిపారు. మంగళవారం ఉదయం వరకు 9.9833 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరిగిందని వివరించారు. 

‘పోచారం’లోకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో  

నాగిరెడ్డిపేట్‌: మండలంలోని పోచారం ప్రాజెక్టులోకి వరద వచ్చి  చేరుతోంది. ఎగువప్రాంతాలైన లింగంపేట్‌, గుండారం, గాంధారి ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో  ప్రాజెక్టులోకి సోమవారం నుంచి వరద వస్తున్నదని ప్రాజెక్టు డీఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం 389 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోందన్నారు.  ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం  6.8 అడుగుల వద్ద ఉన్నట్లు ఆయన తెలిపారు.


logo