బుధవారం 21 అక్టోబర్ 2020
Nizamabad - Aug 12, 2020 , 02:58:32

హరిత పందిళ్లు!

హరిత పందిళ్లు!

  • రహదారుల వెంట పరుచుకున్న పచ్చదనం
  • బాటసారులకు నీడనిస్తున్న చెట్లు

బీబీపేట మండలంలోని పలు గ్రామాల్లో ప్రధాన రోడ్లకు ఇరువైపులా హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. మొక్కలు పెరిగి బాటసారులకు నీడని నిస్తున్నాయి. సంగమేశ్వర్‌ నుంచి మాందాపూర్‌ వెళ్లే రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు పచ్చని తోరణంలా అల్లుకున్నాయి. జనగామమర్రి నుంచి మాందాపూర్‌కు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మాందాపూర్‌ గ్రామ పంచాయతీ ఆవరణలో నాటిన మొక్కలు పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయి.

-బీబీపేట్‌logo