గురువారం 22 అక్టోబర్ 2020
Nizamabad - Aug 07, 2020 , 03:52:34

కరోనా కాలంలో.. బతుకు బరువై..

కరోనా కాలంలో.. బతుకు బరువై..

  • లాక్‌డౌన్‌తో సాగని గాజుల అమ్మకం 
  • కూతురికి విషం ఇచ్చి.. ఉరేసుకున్న తండ్రి 

కామారెడ్డిరూరల్‌ : కరోనా మహమ్మారి పేద కుటుంబాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. రోజువారీ కూలి పనిచేసుకునే వారికి శాపంగా మారుతున్నది. చేయడానికి పని లేక.. తినడానికి తిండిలేక జీవితం గడపడం కష్టమవుతోంది. రోజు వారీ పని చేసుకొని పొట్టపోసుకునే ఓ వ్యక్తి.. కరోనా నేపథ్యంలో పనిలేక.. తినడానికి కష్టం గా మారడంతో తన కూతురుకు విషం ఇచ్చి.. తాను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన కామారెడ్డిలో గురువారం చోటు చేసుకున్నది. 

దేవునిపల్లి ఎస్సై శ్రీకాంత్‌,  స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని గోసంగి కాలనీకి చెందిన షేక్‌ అక్బర్‌(49) భార్య పది సంవత్సరాల క్రితం మరణించింది. అప్పటి నుంచి అక్బర్‌ బండిపై గాజులు అమ్ముతూ కూతురు సహేరా బేగం(14)ను పోషిస్తున్నాడు. కిడ్నీ, అస్తమా సమస్యలతో బాధపడుతున్న అతడికి ఇటీవల కరోనా ప్రభావంతో పని లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆయన బుధవారం రాత్రి కూతురుకు థమ్సప్‌లో క్రిమి సంహారక మందు కలిపి ఇచ్చాడు. కూతురు మ రణించగానే అతడు కూడా ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అందరితో కలుపుగోలుగా ఉండే ఆ తండ్రీకూతురు మృతిచెందడం కాలనీలో విషాదాన్ని నింపింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు. 


logo