ఆదివారం 25 అక్టోబర్ 2020
Nizamabad - Aug 03, 2020 , 00:29:12

కరోనా బారినపడకుండా అప్రమత్తంగా ఉండాలి

కరోనా బారినపడకుండా అప్రమత్తంగా ఉండాలి

 కోటగిరి/రుద్రూర్‌ :  కరోనా వైరస్‌బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జడ్పీటీసీ శంకర్‌పటేల్‌, డీసీసీబీ డైరెక్టర్‌, డోంగ్లీ విండో చైర్మన్‌ రామ్‌పటేల్‌ అన్నారు. జహీరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు బీబీ పాటిల్‌ ఉచితంగా సరఫరా చేసిన ఇమ్యూనిటీ బూస్టర్‌ కిట్లను ఆదివారం మండల కేంద్రంలో  ఆయా గ్రామాల సర్పంచులకు పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాధి నిరోధకశక్తిని పెంచుకునేందుకు ప్రతి ఒక్కరూ ఇమ్యూనిటీ బూస్టర్‌ కిట్‌ను వాడాలని అన్నారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఐదు మాత్రల చొప్పున ఐదు రోజులు వాడాలని, మాత్రలు వేసుకునే 15 నిమిషాల ముందు, వేసుకున్న తరువాత 15 నిమిషాల వరకు ఆహారం, నీరు తీసుకోవద్దని సూచించారు. హోమియోపతి మాత్రలను ప్రతి ఒక్కరూ వాడవచ్చని అన్నారు. 

ప్రజలకు ఇమ్యూనిటీ బూస్టర్‌ కిట్లను సరఫరా చేసిన ఎంపీ బీబీ పాటిల్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ మర్కెల్‌ గంగాధర్‌పటేల్‌, ఏఎంసీ చైర్మన్‌ నీరడి గంగాధర్‌, మండల కన్వీనర్‌ ఎజాజ్‌ఖాన్‌, వి.శ్రీనివాస్‌, కొల్లూర్‌ కిశోర్‌, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్‌, వర్ని శంకర్‌, డీసీసీబీ డైరెక్టర్‌ శాంతేశ్వర్‌పటేల్‌, జుమ్మాఖాన్‌, ఎంపీటీసీ అనంత విఠల్‌, వెంకట్‌రెడ్డి, గంట్ల విఠల్‌, హెల్త్‌ సూపర్‌వైజర్‌ కృష్ణవేణి, ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రుద్రూర్‌, వర్ని మం డల కేంద్రాల ప్రజలకు టీఆర్‌ఎస్‌ నాయకులు ఇమ్యూనిటీ బూస్టర్‌ కిట్లను పంపిణీ చేశారు. 

కార్యక్రమంలో రుద్రూర్‌ ఎంపీపీ అక్కపల్లి నాగేందర్‌, వైస్‌ ఎంపీపీ సాయిలు, ఏఎంసీ చైర్మన్‌ సంజీవ్‌, పీఏసీఎస్‌ అధ్యక్షులు సంజీవ్‌రెడ్డి, సాయిబాబా, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్‌, గిరి, మేక వీర్రాజు,  కోటగిరి వైస్‌ ఎంపీపీ గంగాధర్‌పటేల్‌, పత్తి రాము, తొట్ల గంగారాం, టీఆర్‌ఎస్‌ కార్యదర్శి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. 


logo