ఆదివారం 09 ఆగస్టు 2020
Nizamabad - Aug 02, 2020 , 00:45:16

నిబంధనలు పాటిస్తూ బక్రీద్‌ వేడుకలు

నిబంధనలు పాటిస్తూ బక్రీద్‌ వేడుకలు

నమస్తే తెలంగాణ యంత్రాంగం :  కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ముస్లిములు బక్రీద్‌ పండుగను శనివారం నిర్వహించుకున్నారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ మత పెద్దలు మాత్రమే మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించారు. బక్రీద్‌ విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ.. మహ్మద్‌ ప్రవక్త ఇచ్చి న సందేశం మేరకు ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు. అన్ని మతాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పండుగను పురస్కరించుకొని ప్రజాప్రతినిధులు ముస్లిములకు ఈద్‌ ముబారక్‌ తెలిపారు. బోధన్‌ పట్టణంలోని నర్సిరోడ్‌లో ఉన్న ఈద్గావద్ద ఎవరూ ప్రార్థనలు చేయరాదని, కేవలం మసీదుల్లో విడుతల వారీగా ప్రార్థనలు చేసుకోవాలని అధికారులు చేసిన సూచనల మేరకు ప్రార్థనలు చేశారు. పట్టణంలోని పలు మసీదుల వద్ద మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మహ్మద్‌ ఎహెతేషాం కమిషన ర్‌ రామలింగంతో కలిసి ముస్లిం పెద్దలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బోధన్‌, మా క్లూర్‌, రెంజల్‌, మోర్తాడ్‌, వేల్పూర్‌, ముప్కాల్‌, నందిపేట్‌, చందూర్‌ మండలాల్లోని ముస్లిములు ఇంట్లోనే ప్రార్థనలు చేశారు. భీమ్‌గల్‌ పట్టణంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మల్లెల రాజశ్రీ, కౌన్సిలర్‌ సతీశ్‌గౌడ్‌ ముస్లిములకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఏర్గట్ల మండలంలోని ముస్లిములకు ఎంపీపీ ఉపేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పూర్ణానందం, ఎంపీటీసీ మధుసూదన్‌, కో-ఆప్షన్‌ సభ్యుడు అశ్రఫ్‌, తాళ్లరాంపూర్‌ సొసైటీ చైర్మన్‌ శ్రీనివాస్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కోటగిరి మండలంలోని ముస్లిములకు స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు సురేందర్‌రెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఆర్మూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజేశ్వర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పండిత్‌ వినీత, ఎంపీపీలు, జడ్పీటీసీలు ముస్లిములకు బక్రీద్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. డిచ్‌పల్లి మండలంలోఎంపీపీ గద్దె భూమన్న, రమేశ్‌నాయక్‌, మోపాల్‌ మండలంలో ఎంపీటీసీ అజీమ్‌ అహ్మద్‌, మైనార్టీ నాయకులు అహ్మద్‌, అబ్బాస్‌, సయ్యద్‌ హుస్సేన్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నగరంలో బక్రీద్‌ పండుగను ముస్లిములు ఇంట్లోనే జరుపుకొన్నారు. కొంతమంది బక్రీద్‌ సందర్భంగా సమాధుల వద్ద పూలుచల్లి పెద్దలను గుర్తుచేసుకొని ప్రార్థించుకున్నారు. నిజామాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో బ క్రీద్‌ పండుగను పురస్కరించుకొని జిల్లాలో ఎలాంటి అ వాంఛనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్తు నిర్వహించారు. నగరంలోని నెహ్రుపార్కు, మాలపల్లి, అర్సప ల్లి, శాంతినగర్‌, నిజాం కాలనీ, గాంధీచౌక్‌ ప్రాంతాల్లో ఆ యా పోలీసు స్టేషన్ల పోలీసులు బందోబస్తు ని ర్వహించారు. నిజామాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలోని ఏసీపీల పర్యవేక్షణలో పండుగ ప్రశాంతంగా జరిగింది.


logo