ఆదివారం 25 అక్టోబర్ 2020
Nizamabad - Jul 29, 2020 , 03:03:20

వైరస్‌ కట్టడికి విస్తృత చర్యలు

వైరస్‌ కట్టడికి విస్తృత చర్యలు

  • రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసులు
  • ఉమ్మడి జిల్లాలో క్వారంటైన్‌ కేంద్రాల ఏర్పాటు
  • నిత్యం పర్యవేక్షిస్తున్న కలెక్టర్లు
  • కామారెడ్డిలో కంట్రోల్‌ రూం ఏర్పాటు
  • నిజామాబాద్‌లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

కొవిడ్‌-19 కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది.  మరో వైపు ప్రభుత్వ యంత్రాంగం వైరస్‌ కట్టడికి అన్ని చర్యలూ తీసుకుంటున్నది. ప్రభుత్వ సూచనల మేరకు అధికారులు ఉభయ జిల్లాల్లో కరోనా బాధితుల కోసం క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్రాల్లో సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. నిత్యం అధికారులతో సమీక్షిస్తూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. కామారెడ్డి జిల్లాలో కొవిడ్‌-19 నియంత్రణకు ప్రత్యేకంగా కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో వైద్యుల కొరత తీర్చేందుకు నిజామాబాద్‌ జిల్లాలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు.

ఆర్మూర్‌ : ఆర్మూర్‌ పట్టణంలో 30 పడకలతో ఏ ర్పాటు చేసిన ఐసోలేషన్‌ సెంటర్‌లో కరోనా వైరస్‌ బారిన పడిన వారికి  మెరుగైన వైద్యసేవలు అం దించాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సూచించారు. మంగళవారం ఆయన ఆర్మూర్‌లోని ఏరియా దవాఖానలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ సెంటర్‌ను పరిశీలించారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో సమా వేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. బాధితుల సంఖ్య పెరిగితే మరిన్ని పడకలను పెంచాలని సూచించారు. ఆర్మూర్‌ డివిజన్‌లో ఇప్పటి వరకు కొవిడ్‌ బారిన పడిన వారి వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కరోనాతో మృత్యువాత పడిన వారి వివరాలు తెలిపారు. కలెక్టర్‌ వెంట ఆర్మూర్‌ డిప్యూటీ డీఎంహెచ్‌వో రమేశ్‌, వైద్యులు అయేషా షరీన్‌, నాగరాజు, అమృత్‌రాంరెడ్డి, దవాఖాన సిబ్బంది పాల్గొన్నారు. 


logo