శనివారం 24 అక్టోబర్ 2020
Nizamabad - Jul 28, 2020 , 01:55:55

ఎస్సారెస్పీలోకి 31,125 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

ఎస్సారెస్పీలోకి 31,125 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

మెండోరా : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఎగువప్రాంతాల నుంచి 31,125 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నదని డీఈ జగదీశ్‌ తెలిపారు. మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్టు గేట్లను ఆదివారం రాత్రి మూసివేయడంతో ఇన్‌ఫ్లో తగ్గిందన్నారు. నాలుగు రోజుల్లో  విష్ణుపురి ప్రాజెక్టు, బాలేగావ్‌, అముదుర బ్యారేజ్‌ల నుంచి నాలుగు టీఎంసీల వరద వచ్చి చేరిందని తెలిపారు. కాకతీయ కాలువకు 4,667 క్యూసెక్కులు,  లక్ష్మి కాలువకు 350 క్యూసెక్కులు, సరస్వతీ కాలువకు 563 క్యూసెక్కులు, అలీసాగర్‌కు 540 క్యూసెక్కులు, గుత్ప ఎత్తిపోతలకు 270 క్యూసెక్కుల  నీటి విడుదల కొసాగుతున్నదని వివరించారు. మిషన్‌ భగీరథ తాగునీటి కోసం 152 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, ఆవిరి, లీకేజీ రూపంలో 412 క్యూసెక్కులు పోతున్నదన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా, సోమవారం సాయంత్రానికి 1074.80 అడుగుల (39.238 టీఎంసీల) నీరునిల్వ ఉందని డీఈ తెలిపారు. 


logo