శనివారం 31 అక్టోబర్ 2020
Nizamabad - Jul 28, 2020 , 01:53:17

ఫిర్యాదుదారులూ.. ఫోన్‌చేస్తే చాలు..

ఫిర్యాదుదారులూ.. ఫోన్‌చేస్తే చాలు..

ఇందూరు : కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఫిర్యాదుదారులు ఇండ్ల నుంచి బయటికి రావొద్దని ఇండ్లల్లో నుంచే ఫోన్‌ ద్వారా ప్రజావాణికి ఫిర్యాదు చేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. ప్రజావాణి ఫోన్‌ ఇన్‌ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఫిర్యాదులను ఫోన్‌ ఇన్‌ద్వారా స్వీకరించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. 08462-220183 నంబర్‌కు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తమ ఫిర్యాదులు తెలియజేయవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటికి రావద్దని సూచించారు. తప్పకుండా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలన్నారు.