ఆదివారం 25 అక్టోబర్ 2020
Nizamabad - Jul 27, 2020 , 04:10:23

జోరుగా హరితహారం

జోరుగా హరితహారం

నిజామాబాద్‌ రూరల్‌ : మండలంలోని 19 గ్రామా ల్లో హరితహారం కార్యక్రమం జోరుగా సాగుతున్నది.  నిర్దే శించిన లక్ష్యం మేరకు మొక్కలను నాటేందుకు ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఎంపీడీవో డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌, ఎంపీవో మధురిమ, ఏపీవో పద్మ తదితరులు హరితహారం కార్యక్రమాన్ని ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షిస్తున్నారు. ఎంపీపీ బానోత్‌ అనూష, జడ్పీటీసీ బొల్లెంక సుమలత, వైస్‌ ఎంపీపీ అన్నం సాయిలు గ్రామాలను సందర్శించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సర్పంచులు, కార్యదర్శులకు సూచిస్తున్నారు. మండలంలో లక్షా 80వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేంచగా ఇప్పటివరకు లక్షా 34 వేల మొక్క లు నాటడం పూర్తయ్యింది. ప్రతి గ్రామంలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి ట్రీగార్డులను ఏర్పాటు చేయడంలో సర్పంచులు, కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. మొక్కల సంరక్షణ కోసం కలెక్టర్‌ ఆదేశం మేరకు ప్రత్యేకంగా 106 మంది వన సేవకులను నియమించారు. పొలాల గట్లపైన 6వేల టేకు మొక్కలను నాటారు. చెరువుల కట్టలపై 7వేల మొక్కలు, ఇండ్ల ఆవరణలో 56వేలు, రోడ్లకిరువైపులా 13వేలు, కమ్యూనిటీ ప్లాంటేషన్‌ 52వేల మొక్కలను నాటడం పూర్తయిందని ఏపీవో పద్మ తెలిపారు. త్వరలోనే నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటడం పూర్తి చేస్తామని ఆమె అన్నారు. 

ఉత్సాహంగా హరితహారం

డిచ్‌పల్లి/మోపాల్‌/ఎడపల్లి (శక్కర్‌నగర్‌): హరితహారం కార్యక్రమం జోరుగా సాగుతున్నది. డిచ్‌పల్లి మండలం ఖిల్లాడిచ్‌పల్లి, మోపాల్‌ మండలం కులాస్‌పూర్‌, ఎడపల్లి మండలం ఒడ్డాపల్లి గ్రామాల్లో ఆదివారం మొక్కలను నాటారు. కులాస్‌పూర్‌లో వీడీసీ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించగా సర్పంచ్‌ కర్ల మమత హాజరై కూలీలతోకలిసి రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటారు.  కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ నాయకులు సాయారెడ్డి, జనార్దన్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ అనిల్‌ తదితరులు పాల్గొన్నారు. డిచ్‌పల్లి మండలంలోని ఖిల్లా డిచ్‌పల్లిలో జాతర నిర్వహించే ప్రాంతంలో గ్రామస్తులు మొక్కలను నాటారు. కార్యక్రమంలో  నర్సింగ్‌, బల్ల గంగాధర్‌, సుధాకర్‌, జె.పోశెట్టి, బాలకిషన్‌, భూమయ్య తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలం ఒడ్డాపల్లి గ్రామంలోని హనుమాన్‌ ఆలయం వద్ద లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఎడపల్లి ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్షుడు చెన్న గంగారెడ్డి, కార్యదర్శి మనోజ్‌, గ్రామస్తులు పాల్గొన్నారు. 


logo