శుక్రవారం 23 అక్టోబర్ 2020
Nizamabad - Jul 24, 2020 , 01:58:01

లాక్‌డౌన్‌ దిశగా గ్రామాలు

లాక్‌డౌన్‌ దిశగా గ్రామాలు

కమ్మర్‌పల్లి/రెంజల్‌/డిచ్‌పల్లి/భీమ్‌గల్‌ : జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు గ్రామాల్లో స్వచ్ఛం ద లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. మరికొన్ని గ్రామాల్లో గురువారం లాక్‌డౌన్‌ అమలు చేశారు. వైరస్‌ వ్యాప్తిచెందకుం డా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా, భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తున్నారు. వేరే గ్రామాల నుంచి ఇతరులు తమ గ్రామాలకు రాకుండా సరిహద్దుల్లో బారికేడ్లను ఏర్పాటు చేసుకున్నారు. మాస్కు లు ధరించకుండా తిరిగిన వారికి జరిమానా విధిస్తామని తీర్మానాలు చేశారు. కమ్మర్‌పల్లిలో సర్పంచ్‌ గడ్డం స్వామి అధ్యక్షతన గురువారం సమావేశం నిర్వహించి శుక్రవారం నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు లాక్‌డౌన్‌ అమలుకు తీర్మానించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే దుకాణాలను తెరిచి ఉంచాలని నిర్ణయించారు. నిబంధనలను ఉల్లంఘించినా, మాస్కులు ధరించకుండా దుకాణాలకు వచ్చినా జరిమానా విధించాలని నిర్ణయించారు. కమ్మర్‌పల్లి మండలం కోనాసముందర్‌లో లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. రెంజల్‌ మండలం సాటాపూర్‌లో ప్రతి శనివారం నిర్వహించే వార సంత రద్దుకు పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు సర్పంచ్‌ వికార్‌పాషా, కార్యదర్శి మహిబూబ్‌అలీ తెలిపారు. డిచ్‌పల్లి మండలం నడిపల్లిలో, ఘన్‌పూర్‌లో ఇప్ప టికే స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చి గ్రామ పంచాయతీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. సుద్దపల్లి, యానంపల్లి, సుద్దులం, కొరట్‌పల్లి, మెంట్రాజ్‌పల్లి, సాంపల్లి, సాంపల్లి తండా, ఖిల్లా డిచ్‌పల్లి, దూస్‌గాం గ్రామస్తులు స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చారు. భీమ్‌గల్‌ పట్టణంలో దుకాణాలను స్వచ్ఛందంగా మూసి ఉంచారు. చందూర్‌లో లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది.


logo