గురువారం 22 అక్టోబర్ 2020
Nizamabad - Jul 23, 2020 , 03:29:46

మొక్కలు నాటి.. స్ఫూర్తినింపి..

మొక్కలు నాటి.. స్ఫూర్తినింపి..

బోధన్‌/మెండోరా/మోర్తాడ్‌/కోటగిరి/ఏర్గట్ల/డిచ్‌పల్లి/ఇందల్వాయి/సిరికొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. అధికారులు, ప్రజాప్రతినిధులు బుధవారం మొక్కలను నాటి నీరుపోశారు. హరితహారం కార్యక్రమం లో అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆయా గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధు లు నాటిన మొక్కలకు కంచెలను ఏర్పాటు చేయించారు. బోధన్‌ పట్టణంలోని న్యాయస్థానం ఆవరణలో బుధవారం ‘హరితహారం’ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏడో అదనపు జిల్లా న్యాయమూ ర్తి సూర్యచంద్రకళ హాజరై మొక్కలు నాటారు. ఆమెతోపా టు పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు సైతం మొక్కలను నాటారు. 

మెండోరా మండలం బుస్సా పూర్‌లో డీసీవో సింహాచలం సర్పంచ్‌ సుజాత, కార్యదర్శి సుకన్య, డీసీసీబీ డైరెక్టర్‌ శేఖర్‌రెడ్డితో కలిసి మొక్కలను పరిశీలించారు. విశాఖపట్నం నుంచి తెప్పించిన నందివర్ధనం, లక్ష్మి తులసి, పారిజాతం, 20 రకాల మొక్కలను పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. మోర్తాడ్‌ మండలం దోన్‌పాల్‌ గ్రామంలో సర్పంచ్‌ పర్స దేవన్న, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ దేవన్న, టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఇం టింటికి తిరుగుతూ మొక్కలను పంపిణీ చేశారు. కోటగిరి మండలం సుంకిని గ్రామంలో 20 మంది యూత్‌ సభ్యు లు స్వచ్ఛందంగా మొక్కలను నాటారు. ఈ నెల 25లోపు మొక్కలు నాటడం పూర్తి చేయాలని ఏర్గట్ల ఎంపీడీవో రాజేశ్‌ తెలిపారు. 

ఇందల్వాయి గ్రామంలో మత్స్య కార్మికుల సంఘం ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఫిషరీస్‌ జిల్లా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాజారాం హాజరై మొక్కలు నాటారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ఈనెల 24న టీయూలో మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు టీయూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రవీందర్‌రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలకు రిజిస్ట్రార్‌ నసీమ్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సిరికొండ లోని పోచమ్మ గుడి వద్ద సర్పంచ్‌ రాజారెడ్డి, గ్రామస్తులు తది తరులు మొక్కలు నాటారు.


logo