గురువారం 22 అక్టోబర్ 2020
Nizamabad - Jul 17, 2020 , 02:07:16

విజృంభిస్తున్న కరోనా

విజృంభిస్తున్న కరోనా

విద్యానగర్‌ : ఉమ్మడి జిల్లాలో కరోనా విజృంభిస్తున్నది. కామారెడ్డి జిల్లాలో బుధవారం సాయంత్రం 5గంటల నుంచి గురువారం సాయంత్రం 5గంటల వరకు 33 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి చంద్రశేఖర్‌ తెలిపారు. కామారెడ్డి పట్టణంలో 19, బాన్సువాడలో ఏ డు, మద్నూర్‌లో ఒకటి, పుల్కల్‌లో ఒకటి, అన్నారంలో ఒక టి, బీర్కూర్‌లో రెండు, ఎల్లారెడ్డిలో ఒకటి, మోర్తాడ్‌ నుంచి బాన్సువాడకు వలసవచ్చిన ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ అ య్యింది. గురువారం నాటికి జిల్లాలో మొత్తం 224 కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. కామారెడ్డి నుంచి 123, ఎల్లారెడ్డి నుంచి ఆరుశాంపిళ్లను హైదరాబాద్‌కు పంపించినట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగాఉండాలని, మాస్కులు ధరించా లని, భౌతికదూరం పాటించాలని సూచించారు. 

నిజామాబాద్‌లో ఇద్దరి మృతి

ఖలీల్‌వాడి: నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ దవాఖానలో గురువారం ఇద్దరు కరోనా పేషెంట్లు మృతి చెందగా, 16 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  దుబ్బ, మాలపల్లి, వినాయక్‌నగర్‌, ముదక్‌పల్లి, ఆర్మూర్‌, ఆలూర్‌లో ఒకటి చొప్పున, గౌతంనగర్‌లో నాలుగు, సీతారాంనగర్‌లో రెండు,  ర్యాపిడ్‌ టెస్టుల ద్వారా మరోరెండు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనాబారిన పడి చికిత్స పొందుతున్న నలుగురికి మళ్లీ టెస్టులు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. 

ఆర్మూర్‌లో ఇద్దరికి..

ఆర్మూర్‌: మున్సిపాలిటీ పరిధిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. వైరస్‌ బారినపడినవారిలో పెర్కిట్‌ ప్రాంతానికి చెందిన 63 ఏండ్ల వృద్ధుడు, ఆలూర్‌ గ్రామానికి చెందిన రెండేండ్ల చిన్నారి ఉన్నట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో రమేశ్‌ తెలిపారు. చిన్నారి కుటుంబం ప్రస్తుతం నిజామాబాద్‌ నగరంలో నివాసం ఉంటున్నదని తెలిపారు. షుగర్‌తో బాధపడుతున్న వృద్ధుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందుతున్నాడని, చిన్నారి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నదన్నారు. పట్టణంలోని ఓ బ్యాంకులో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగికి సైతం బుధవారం పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. 

వేల్పూర్‌లో యువతికి..

వేల్పూర్‌: మండల కేంద్రానికి చెందిన 19 ఏండ్ల యువతికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి అశోక్‌ తెలిపారు. ఆమెను జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానకు తరలించామని, సదరు యువతి తండ్రికి మూడురోజుల క్రితం పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో కుటుంబ సభ్యులకు టెస్టులు నిర్వహించగా యువతికి పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. 

సాటాపూర్‌కు చెందిన యువకుడికి..

రెంజల్‌ : మండలంలోని సాటాపూర్‌ గ్రామానికి చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కరోనా లక్షణాలు ఉండడంతో యశోద దవాఖానలో టెస్టు చేయించుకోగా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. సమాచారం అందుకున్న మండల వైద్యసిబ్బంది ఆ యువకుడి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ చేశారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. 

ఎల్లారెడ్డి మండలంలో తొలికేసు..

ఎల్లారెడ్డి: మండలంలో తొలిపాజిటివ్‌ కేసు నమోదైంది. మండలంలోని అన్నాసాగర్‌ గ్రామానికి చెందిన మహిళకు పాజిటివ్‌ నిర్ధారణకావడంతో ఆమెతో ప్రైమరీ కాంటాక్టు అయి న వారిని గుర్తించిన వైద్యారోగ్య సిబ్బంది వారికిసైతం టెస్టులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన ఓ వ్యాపారి కరోనా లక్షణాలతో మృతి చెందినట్లు పుకార్లురావడంతో అతడి కుటుంబ సభ్యులకు టెస్టులు చేశారు. కామారెడ్డి నుంచి వచ్చి ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా ఉద్యోగికి కూడా బుధవారం పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు తెలియడంతో సిబ్బంది కామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో గురువారం టెస్టులు చేయించుకునేందుకు వెళ్లారు. మండలానికి చెందిన మహిళ కరోనా బారినపడడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కొద్దిరోజుల పాటు లాక్‌డౌన్‌ పాటించాలని కోరుతున్నారు. 

ర్యాపిడ్‌ టెస్టులు ప్రారంభం

ఖలీల్‌వాడి/బోధన్‌: జిల్లాలోని పీహెచ్‌సీల పరిధిలో కొవిడ్‌-19 ర్యాపిడ్‌టెస్టులు గురువారం ప్రారంభమయ్యాయి.  ర్యాపిడ్‌ టెస్టుల ద్వారా పదినిమిషాల్లో రిపోర్టురాగా, జిల్లాలోని ఆయా పీహెచ్‌సీల పరిధిలో తొమ్మి ది కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సుదర్శనం తెలిపారు. ప్రతి పీహెచ్‌సీలో శుక్రవారం కరోనా లక్షణాలు ఉన్న వారికి టెస్టులు నిర్వహిస్తామన్నారు. పాజిటివ్‌ వచ్చిన రోగులకు ప్రభుత్వ దవాఖాన లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని, 200           పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తిరుమల దవాఖానలో మరో 100 పడకలను సిద్ధం చేశామన్నారు. బోధన్‌ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి, వారి కుటుంబసభ్యులకు మొత్తం 16 మందికి ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించారు.  ముగ్గురు వైద్య సిబ్బందితోపాటు వారి సంబంధీకులు నలుగురికి పాజిటివ్‌ నిర్ధారణ కావడం పట్టణంలో కలకలంరేపింది.

మహారాష్ట్ర నుంచిపారిపోయి వచ్చి..

బిచ్కుంద: మహారాష్ట్రలోని దెగ్లూర్‌లో ఉన్న ప్రభుత్వ క్వారంటైన్‌సెంటర్‌ నుంచి ఓ కరోనా పేషెంట్‌ పారిపోయి బిచ్కుందకు వచ్చాడు. బస్టాండ్‌లో అతడిని గమనించిన ప్రయాణికులు అతడి వివరాలను సేకరించి మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే మహారా ష్ట్రకు చెందిన పోలీసులతోపాటు వైద్యసిబ్బంది బిచ్కుం దకు చేరుకుని ఆ వ్యక్తిని దెగ్లూర్‌కు తరలించారు. మహారా ష్ట్ర నుంచి పారిపోయి వచ్చిన కరోనా రోగి స్థానికంగా ఎవరినైనా కలిశాడా? ఎక్కడెక్కడ తిరిగాడు? తదితర వివరాలపై స్థానిక వైద్యారోగ్య సిబ్బంది ఆరా తీస్తున్నారు. 


logo