శుక్రవారం 23 అక్టోబర్ 2020
Nizamabad - Jul 13, 2020 , 03:08:30

నిరాడంబరంగా ఊరపండుగ

నిరాడంబరంగా ఊరపండుగ

ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుపుకొనే ఊర పండుగను ఆదివారం నగరవాసులు ఎలాంటి ఆర్భాటం లేకుండా సాదాసీదాగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఎలాంటి హడావుడి లేకుండా జరుపుకొన్నారు. కొద్ది మంది మాత్రమే హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతికదూరం పాటించారు. డప్పుల దరువు, పోతరాజుల విన్యాసాలు, బోనాల ఊరేగింపులతో సందడిగా కనిపించే ప్రాంతం జనం లేక వెలవెలబోయింది. ప్రతి ఏడాది యాటలు కోసేవారు. కానీ ఈ సారి కొబ్బరికాయలతో అమ్మవారి మొక్కు చెల్లించుకున్నారు. ఖిల్లా ప్రాంతం, వినాయక్‌నగర్‌లోని మహాలక్ష్మి ఆలయాలకు కొద్దిమంది మాత్రమే తరలివచ్చారు. పంటలు బాగా పండాలని, కరోనా నుంచి కాపాడాలని తల్లిని వేడుకున్నారు. అనంతరం కుటుంబసమేతంగా వనభోజనాలకు వెళ్లారు.logo