శుక్రవారం 07 ఆగస్టు 2020
Nizamabad - Jul 12, 2020 , 01:30:51

హరితహారం, కొవిడ్‌-19పై అవగాహన

హరితహారం, కొవిడ్‌-19పై అవగాహన

  • బైక్‌ర్యాలీ చేపట్టిన హైదరాబాద్‌కు చెందిన ఉపాధ్యాయుడు

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌కు చెందిన ఓ ఉపాధ్యాయుడు శ్రీకారం చుట్టాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన ఎం. మల్లికార్జున్‌ దోమలగూడలోని ప్రభుత్వ వ్యాయామ విద్యాకళాశాలలో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నాడు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంతోపాటు కొవిడ్‌-19 పై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో శుక్రవారం బైక్‌ర్యాలీ ప్రారంభించాడు. బైక్‌ర్యాలీ శనివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చేరుకోగా జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.   హరితహారం కార్యక్రమంతోపాటు కరోనాపై రాష్ట్రంలోని 30 జిల్లాల్లో పర్యటించి అవగాహన కల్పించనున్నట్లు ఈ సందర్భంగా మల్లికార్జున్‌ తెలిపారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ జిల్లా ‘పేటా’కార్యదర్శి, ఫిజికల్‌ డైరెక్టర్‌ టి.విద్యాసాగర్‌రెడ్డి, రాజేందర్‌, ఫుట్‌బాల్‌ కోచ్‌ గొట్టిపాటి నాగరాజు పాల్గొన్నారు.  -ఇందూరు 


logo