ఆదివారం 25 అక్టోబర్ 2020
Nizamabad - Jul 08, 2020 , 02:31:41

అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి

అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి

ఎడపల్లి(శక్కర్‌నగర్‌): గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనులను జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఎడపల్లి మండల స్థాయి అధికారులను ఆదేశించారు. ఎడపల్లి మండలంలోని జైతాపూర్‌ గ్రా మాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. గ్రామంలో ఇంత వరకు ఓ వివాదం కారణంగా వైకుంఠధామం పనులు ప్రారంభించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామస్తులం దరూ కలిసి మాట్లా డుకుని వైకుంఠధామం కోసం స్థలాన్ని కేటాయించాలని గ్రామ పెద్దలకు సూచించారు. గ్రామంలో నిర్మిస్తున్న కంపోస్ట్‌షెడ్డు, నర్సరీని పరిశీలించారు. 

ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామాభివృద్ధి మధ్యలో నిలిచిపోకుండా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఎంపీడీవో శంకర్‌, తహసీల్దార్‌ ప్రవీణ్‌కుమార్‌కు సూచించారు. ఆయన వెంట ఎడపల్లి ఎంపీపీ శ్రీనివాస్‌, ఎంపీడీవో శంకర్‌, తహసీల్దార్‌ ప్రవీణ్‌కుమార్‌, సర్పంచ్‌ పామిరెడ్డి లక్ష్మి తదితరులు ఉన్నారు.


logo