ఆదివారం 09 ఆగస్టు 2020
Nizamabad - Jul 08, 2020 , 02:29:32

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై స్పష్టత కరవు

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై స్పష్టత కరవు

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో అనర్హత కారణంగా ఖాళీ ఏర్పడిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై స్పష్టమైన నిర్ణయం కరువైంది. భారత ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి ఏర్పడింది. కొవిడ్‌ -19 విస్తృతి నేపథ్యంలో గతంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఏప్రిల్‌ 7న జరగాల్సిన పోలింగ్‌ను రెండు నెలల పాటు వాయిదా వేసింది. అనంతరం మే 22న మరోమారు 45 రోజుల పాటు ఎన్నిక ప్రక్రియను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. రెండోసారి ఇచ్చిన వాయిదా గడువు సైతం ఈ నెల 7వ తేదీ నాటికి ముగిసింది. కొత్త నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందన్న అంశంపై ఆయా రాజకీయ పార్టీలు ఎదురు చూడగా ఎలక్షన్‌ కమిషన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు, లాక్‌డౌన్‌ సడలింపుల ఫలితంగా ప్రస్తుతం అంతటా సాధారణ పరిస్థితులే నెలకొన్నాయి. జన జీవనం అంతా సవ్యంగానే కొనసాగుతున్న వేళ భారత ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయంపై అందరి చూపు కేంద్రీకృతమైంది.logo