ఆదివారం 09 ఆగస్టు 2020
Nizamabad - Jul 08, 2020 , 02:29:29

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

ఆర్మూర్‌ : ప్రతి ఒక్కరూ తమ ఇంటితో పాటు పరిసర ప్రాంతాలనూ శుభ్రంగా ఉంచుకోవాలని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఆ యన ఆర్మూర్‌ మండల కేంద్రంతోపాటు మామి డిపల్లి, గోవింద్‌పేట్‌ గ్రామాల్లో   పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆర్మూర్‌ ము న్సిపల్‌ పరిధిలో నాలుగు చోట్ల ట్రాఫిక్‌ సిగ్నళ్లను చైర్‌పర్సన్‌, స్థానిక కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు. అనంతరం మామిడిపల్లిలో మున్సిపల్‌ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన 12 ట్రాలీఆటోలను ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ట్రా ఫిక్‌ సిగ్నళ్ల ఏర్పాటుతో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. 12  ట్రాలీ ఆటోల ద్వారా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తామన్నారు. ప్రజలు ఈ ట్రాలీలను సద్వినియోగం చేసుకోవాలని, చెత్తను బ యట పారవేయవద్దని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పండిత్‌ వినీత పవన్‌, కౌన్సిలర్లు మేడిదాల సంగీత రవిగౌడ్‌, నర్సారెడ్డి, ప్రసాద్‌, ఆకుల రాము, వనపత్రి కవిత, మాజీ కౌన్సిలర్‌ పండిత్‌ ప్రేమ్‌, కమిషనర్‌ శైలజ  పాల్గొన్నారు.

గోవింద్‌పేట్‌లో.. 

మండలంలోని గోవింద్‌పేట్‌లో పార్కుతోపాటు వై కుంఠధామం నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్మశానవాటిక ప్రాంగణంలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో గోవింద్‌పేట్‌ గౌడ సంఘం వద్ద, గ్రామ చెరువు కట్ట వద్ద, ఎల్లమ్మ దేవాలయం వద్ద సుమారు వెయ్యి ఈత మొక్కలను నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గౌడ కులస్తుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదన్నారు. ఈత, తాటి చెట్లకు చెల్లించే రెంటల్‌ను ప్రభుత్వం రద్దు చేసినట్లు తెలిపారు. వీటితోపాటు ప్రతి కార్మికుడికి రూ.5 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పిస్తున్నదన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ బండమీది జమున, ఉప సర్పంచ్‌ గంగాధర్‌, ఎంపీటీసీ సభ్యుడు యాల్ల రాజ్‌కుమార్‌, ఎంపీపీ పస్క నర్సయ్య, తహసీల్దార్‌ సంజీవ్‌రావు టీఆర్‌ఎస్‌ నాయకులు, గోవింద్‌పేట్‌ గౌడ సంఘ సభ్యులు, ఆర్మూర్‌ ఎక్సైజ్‌ శాఖ సీఐ నంద్యాల రఘునాథరెడ్డి, ఎస్‌హెచ్‌వో రాఘవేందర్‌  తదితరులు పాల్గొన్నారు.


logo