ఆదివారం 09 ఆగస్టు 2020
Nizamabad - Jul 08, 2020 , 02:20:11

ఎల్‌ఆర్‌ఎస్‌ గడువును పొడిగించిన ప్రభుత్వం

ఎల్‌ఆర్‌ఎస్‌ గడువును పొడిగించిన ప్రభుత్వం

లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌) గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సెప్టెంబర్‌ 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. నిజామాబాద్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఇప్పటి వరకు 64 అక్రమ లేఅవుట్లను గుర్తించారు.  నుడా పరిధిలో ఇప్పటి వరకు ఎల్‌ఆర్‌ఎస్‌కు 69 దరఖాస్తులు రాగా రూ.8 లక్షల 60 వేల ఆదాయం వచ్చింది. నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఇటీవల విలీనమైన 9 గ్రామాల్లో అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. దీనిపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఖలీల్‌వాడి:  భవనాలు, లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవడానికి గడువును ప్రభుత్వం మరోసారి పెంచింది. ఇందుకోసం ఎల్‌ఆర్‌ఎస్‌ (లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం)ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ స్కీం నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టినవారికి వరంగా మారింది. నిజామాబాద్‌ నగరం రోజురోజుకూ విస్తరిస్తున్నది. దీంతోపాటు నిర్మాణ రంగం ఊపందుకుంటున్నది. నగరశివారు ప్రాంతాల్లో కొత్త కాలనీలను ఏర్పాటుచేస్తూ భారీ సంఖ్యలో ఇండ్ల నిర్మాణ పనులు చేపడుతున్నారు.  కొన్నిచోట్ల డీటీసీపీ అప్రూవల్‌ లేకుండానే  నిర్మాణాలు సాగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో వ్యవసాయ క్షేత్రాలు, సొంతభూముల్లో రియల్‌ వెంచర్లు వెలిశాయి. ఇందులో కొన్ని వెంచర్లను డీటీసీపీ లేఅవుట్‌ లేకుండా ఏర్పాటు చేశారు. ఇందులో భవన నిర్మాణాలు చేపట్టాలంటే కచ్చితంగా నగర పాలకసంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అనుమతి తప్పనిసరి. కార్పొరేషన్‌ పరిధిలో అధికారులు ఇప్పటి వరకు 64 అక్రమ లేవుట్‌లను గుర్తించారు. నుడా పరిధిలో 8 మండలాలు, 73 గ్రామాలు ఉన్నాయి. కొత్త మాస్టర్‌ప్లాన్‌ ద్వారా గ్రామాల అభివృద్ధికి  నుడా ఎంతో ఉపయోగపడనుంది. ప్రతి వెంచర్‌ కూడా నుడా అనుమతి తీసుకుంటేనే రోడ్లు, డ్రైనేజీ, వీధిదీపాలు, బ్యాంకు రుణాలు అందే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. దీనిపై గ్రామాల్లో  అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అక్రమ లేఅవుట్‌ ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవడానికి సెప్ట్టెంబర్‌ 30 వరకు దరఖాస్తు చేసుకునే  అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దీంతో యజమానులు తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. నుడా పరిధిలో ఇప్పటి వరకు 69 దరఖాస్తులు రాగా ఆదాయం రూ.8,60,179 వచ్చింది.

 

 


logo