శుక్రవారం 30 అక్టోబర్ 2020
Nizamabad - Jul 06, 2020 , 02:11:20

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

మెండోరా : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో రిజర్వాయర్‌లోకి స్వల్పంగా ఇన్‌ఫ్లో వస్తున్నదని ప్రాజెక్టు డీఈ జగదీశ్‌ తెలిపారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వానతో ప్రాజెక్టులోకి 5,610 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నదన్నారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 1.931 టీఎంటీల నీరు వచ్చి చేరిందని చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులతో 90.313 టీఎంసీలు కాగా ఆదివారం సాయంత్రానికి 1071.20 అడుగులతో 31.428 టీఎంసీలు ఉంద న్నారు. గత ఏడాది ఇదే రోజున ప్రాజెక్టులో 1048.6 అడుగులతో 5.458టీఎంసీల నీరు నిల్వ ఉన్నదని డీఈ పేర్కొన్నారు.