శనివారం 24 అక్టోబర్ 2020
Nizamabad - Jul 06, 2020 , 02:06:19

విలేజ్‌ పార్కుల పనులు ప్రారంభించాలి

విలేజ్‌ పార్కుల పనులు ప్రారంభించాలి

ఇందూరు :  జిల్లాలోని 355 గ్రామాల్లో విలేజ్‌ పార్కుల పనులను తక్షణమే ప్రారంభించాలని నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు, ఎంపీడీవోలతో సెల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  ప్రకృతి వనాల కోసం స్థలాలను గుర్తించిన  పంచాయతీల నుంచి తీర్మానాలు తె ప్పించుకుని రేపటిలోపు మంజూరు ఉత్తర్వులు తీసుకొని పనులను ప్రారంభించాలన్నారు. రేపు సా యంత్రం ఎన్నికల కమిషన్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు నిర్ణయం తీసుకుంటే ప్రారంభం కాని పనులకు ఎన్నికలకోడ్‌ వర్తిస్తుందని తెలిపారు. జిల్లా పరిషత్‌ సీఈవో, డీఆర్డీవో ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించి ఎంపీడీవోలకు మార్గనిర్దేశం చేసి సోమవారంలోగా  పనులు ప్రారంభమయ్యేలా చూడాలన్నారు.  పనులను ప్రారంభించడానికి ప్రొటోకాల్‌ ప్రకారం ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని ఈ పనులను అదనపు కలెక్టర్‌ పర్యవేక్షించాలన్నారు. 530 గ్రామపంచాయతీలలో వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డుల్లో అప్రోచ్‌ రోడ్లు, మొరం నింపడం, భూమిని చదును చేయడం వంటి పనులు జూలై 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.  5 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనా ఎక్కడా నీరు నిల్వకుండా మొరం నింపాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు.

 అవసరమైన మొరాన్ని గ్రామపంచాయతీ ట్రాక్టర్లు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద లేబర్లను ఉపయోగించుకుని పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 2020 హరితహారంలో భాగంగా 10లక్షల మొక్కలు నాటినట్లయితే దాదాపు 2900మంది గ్రామ వన సేవకులను నియమించుకుని వారికి ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో వాచ్‌వార్డు కేంద్ర చెల్లింపులు చేయవచ్చని, పంచాయతీరాజ్‌ శాఖకు సంబంధించిన రోడ్ల పక్కన చేపట్టాల్సిన అవెన్యూ ప్లాంటేషన్‌  నాటడం, ట్రీ గార్డులను  అమర్చడం శనివా రం లోపు పూర్తి చేయాలన్నారు.  మొక్కల మధ్య  ఐదుమీటర్ల దూరం ఉండాలన్నారు. లేబర్‌ టర్న్‌ అవుట్‌ పెంచడానికి గ్రామాల మధ్య రోడ్లు, అప్రోచ్‌ రోడ్లకు సంబంధించిన పనులు చేపట్టేలా పక్కా ప్రణాళికను రూపొందించి, పంచాయతీ కార్యదర్శులను చైతన్యపరిచి పనులు పూర్తి చేయాలన్నారు. ఇబ్బందులు లేకుండా ఉన్న దరఖాస్తుదారులకు కల్లాల నిర్మాణానికి మంజూ రు ఉత్తర్వులు జారీ చేయాలని డీఆర్‌డీవోలకు సూచించారు. 


logo