సోమవారం 19 అక్టోబర్ 2020
Nizamabad - Jul 05, 2020 , 00:57:14

నేటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ

నేటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ

  • ఒక్కొక్కరికీ పది కిలోల చొప్పున..
  • రేషన్‌ దుకాణాల ద్వారా అందజేత
  • ఉమ్మడి జిల్లాలో 5.49 లక్షల మంది లబ్ధిదారులు

ఖలీల్‌వాడి/కామారెడ్డి: రేషన్‌ లబ్ధిదారులకు తీపి కబురు. ఉమ్మడి జిల్లాలో నేటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రేషన్‌ దుకాణాల ద్వారా ఒక్కొక్కరికీ 12 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసిన విషయం తెలిసిందే. మళ్లీ నేటి నుంచి తెల్లరేషన్‌ కార్డు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయనుంది. ఒక్కొక్కరికీ పది కిలోల చొప్పున పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో 3లక్షల 686 రేషన్‌ కార్డులు ఉండగా, 751 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 2లక్షల 48వేల 913 రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 5.49 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. అన్నపూర్ణ లబ్ధిదారులకు 10 కిలోల చొప్పున, అంత్యోదయ కార్డు ఉన్న వారికి 35 కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా అందజేయనున్నారు. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో కందిపప్పు పొందని వినియోగదారులు ప్రస్తుతం కందిపప్పు తీసుకోవచ్చని, ఈ నెల 20వ తేదీ వరకు పంపిణీ చేస్తారని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌ తెలిపారు. రేషన్‌ దుకాణాల వద్ద తప్పకుండా భౌతికదూరం పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి రావాలని అధికారులు సూచించారు.


logo