బుధవారం 12 ఆగస్టు 2020
Nizamabad - Jul 05, 2020 , 00:57:15

‘డబుల్‌' పనులను వేగవంతం చేయాలి

‘డబుల్‌' పనులను వేగవంతం చేయాలి

  •  nహరితహారం మొక్కలను సంరక్షించాలి
  • nనిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి

డిచ్‌పల్లి (ఇందల్‌వాయి): డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. డిచ్‌పల్లి మండలంలోని నడిపల్లి, ఇందల్వాయి, గన్నారం గ్రామాల్లో కొనసాగుతున్న డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులను కలెక్టర్‌ శనివారం పరిశీలించారు. నడిపల్లిలో బేస్‌మెట్‌ దశలో నిలిచిపోయిన పనులు వారంరోజుల్లో ప్రారంభమవుతాయని అన్నారు. నడిపల్లిలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ట్రీ గార్డులు ఏర్పాటు చేసి నీళ్లు పోశారు. మొక్కలను సంరక్షించేందుకు వనసేవకులను నియమించాలని ఆదేశించారు. నడిపల్లి నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా అందంగా కనిపించేలా మొక్కలను నాటించాలని ఎంపీడీవోను ఆదేశించారు. నిర్మాణ దశలో ఉన్న వైకుంఠధామం పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. మండల కేంద్రంలో మొక్కల పెంపకానికి ఎంపీడీవో మర్రి సురేందర్‌, ఏపీవో ఓంకార్‌ చేస్తున్న కృషి బాగుందని కలెక్టర్‌ అభినందించారు. గ్రామాలు పచ్చదనంతో అందంగా కనిపించేలా కొబ్బరి, అశోక చెట్లను పెంచాలన్నారు. గన్నారం గ్రామంలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంకోసం గుర్తించిన స్థలాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. కలెక్టర్‌ వెంట ఎంపీపీ రమేశ్‌ నాయక్‌, వైస్‌ ఎంపీపీ అంజయ్య, కులాచారి శ్యామ్‌రావు, సతీశ్‌రావు, సర్పంచులు సత్తెవ్వ, మోహన్‌రెడ్డి, జిల్లా సహకార అధికారి సింహాచలం, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ  రాజేశ్వర్‌రెడ్డి, ఈఈ రాంబాబు, డీఈ రాజేందర్‌, ఎంపీడీవోలు రాములు నాయక్‌, మర్రిసురేందర్‌, తహసీల్లార్లు వేణుగోపాల్‌, రమేశ్‌, ఎంపీవో సుభాష్‌, ఆర్‌ఐ సాయాగౌడ్‌, అధికారులు, ఈజీఎస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

తాజావార్తలు


logo