గురువారం 22 అక్టోబర్ 2020
Nizamabad - Jul 04, 2020 , 02:46:03

పాల్ద వైకుంఠధామాన్ని పరిశీలించిన కలెక్టర్

పాల్ద వైకుంఠధామాన్ని పరిశీలించిన కలెక్టర్

నిజామాబాద్ రూరల్: మండలంలోని పాల్దలో నిర్మించిన వైకుంఠధామాన్ని కలెక్టర్ నారాయణరెడ్డి శుక్రవారం పరిశీలించారు. వైకుంఠధామంలో కల్పించిన సౌకర్యాలు, ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వసతులు, మొక్కలతో గ్రీనరీగా తీర్చిదిద్దడంపై  సంతృప్తి వ్యక్తం చేస్తూ సర్పంచ్, ఎంపీటీసీ,  పంచాయతీ కార్యదర్శి పనితీరును అభినందించారు. ఇతర పాల్ద వైకుంఠధామం మాదిరిగా అన్ని గ్రామాల్లో నిర్మించేలా సర్పంచులు సందర్శించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు.  అనంతరం కంపోస్ట్ షెడ్డు, డంపింగ్ యార్డులను పరిశీలించారు. కంపోస్ట్ షెడ్డుకు తడి, పొడి చెత్తను తరలించే ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. రోజూ ఉపాధి పనులు చేపట్టాలని, కూలీల సంఖ్యను పెంచడంలో కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది చొరవ చూపాలన్నారు. కచ్చా కాలువల్లో పేరుకపోయిన పూడికను తీయించాలని, 400 మొక్కల సంరక్షణకు ఒక వాచ్‌మన్‌ను నియమించుకొని రోజుకు రూ.237 చొప్పున ఈజీఎస్ ద్వారా చెల్లించాలని సూచించారు. అనంతరం మొక్కను నాటారు. కార్యక్రమంలో ఎంపీడీవో సంజీవ్‌కుమార్, ఎంపీవో మధురిమ, సర్పంచ్ సుప్రియ, ఎంపీటీసీ ఆమని, సొసైటీ చైర్మన్ మాధవ్‌రెడ్డి, ఉపసర్పంచ్ నరేశ్, ఏపీవో పద్మ, కార్యదర్శి గంగాధర్, గ్రామపెద్దలు నవీన్, లచ్చన్న, దేవన్న, రాజేందర్, క్రీస్తుదాసు  పాల్గొన్నారు. 


logo