శుక్రవారం 07 ఆగస్టు 2020
Nizamabad - Jul 03, 2020 , 02:57:22

మాకు న్యాయం చేయండి!

మాకు న్యాయం చేయండి!

  • అధికారులకు మౌలాన్‌ఖేడ్, సోమార్‌పేట్ గ్రామస్తుల వినతి                                                                                                                                                                                 

ఎల్లారెడ్డి రూరల్: తమ భూమిలో పంటలు వేసుకోవచ్చంటూ కొందరు దౌర్జన్యం చేస్తున్నారని మౌలాన్‌ఖేడ్, సోమార్‌పేట్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు గురువారం ఎల్లారెడ్డి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో డీఏవో శాంతకు వినతిపత్రం అందజేశారు. తమది పట్టాభూమి అని, నిజాంసాగర్ ముంపు ప్రాంతంలో ఉన్నందున అది శిఖం భూమి అవుతుందని, అందులో ఎవరైనా పంటలు పండించవచ్చు అంటూ కొందరు దౌర్జన్యం చేస్తున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన 20 గేట్లు ఏర్పాటుచేసిన సమయంలో దానికి వెనుక భాగంలో ఉన్న తమ భూముల్లోకి నీరు వచ్చి మునిగిపోయినట్లు తెలిపారు. ప్రాజెక్ట్‌లో నీరు లేని సమయంలో తమ భూమిలో పంటలు పండించుకుంటూ జీవనం సాగించేవారమన్నారు. అది శిఖం భూమి అంటూ పట్టణంలోని గూడెం వాసులైన గుస్క అంజయ్య, ఎడ్ల కిషన్, వినోద్, సుల్తాన్ శ్రీను, గుస్క మల్లేశ్, జల్లి రాజు, ఎడ్ల వెంకటి, కోర్నపల్లి నారాయణ కలిసి దౌర్జన్యానికి పాల్పడుతున్నట్లు వారు ఆరోపించారు. అధికారులు తమ భూమికి సంబంధించిన అన్ని పత్రాలు పరిశీలించి తమకు భూమిని ఇప్పించాలని వినతిపత్రంలో కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో రెండు గ్రామాలకు చెందిన భూషణం, శంకరయ్య, గంగారాం, భూమయ్య, మల్లేశ్, ప్రభాకర్, పోచయ్య, నర్సింలు, పిట్ల లక్ష్మయ్య తదితరులున్నారు.logo