శుక్రవారం 07 ఆగస్టు 2020
Nizamabad - Jul 03, 2020 , 02:57:24

ప్రతి గ్రామానికి భగీరథ నీరు అందించాలి

ప్రతి గ్రామానికి  భగీరథ నీరు అందించాలి

  • nనిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు

నిజామాబాద్ సిటీ: జిల్లాలోని ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ ద్వారా నీటిని అందించాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు అధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్ ప్రతి గ్రామానికీ శుద్ధజలాలు అందించాలనే లక్ష్యంగా మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించారన్నారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చివరిరోజు స్థాయి సంఘా సమావేశంలో ఆర్థిక, ప్రణాళిక, సాంఘిక సంక్షేమం నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ శాఖలపై సమీక్ష నిర్వహించారు. చైర్మన్ మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతిగృహాల్లో మొక్కలు నాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గతంలో జడ్పీ నుంచి మంజూరైన నిధులు గత మార్చి వరకు పనులు ప్రారంభించకపోతే  రద్దు చేయాలని సూచించామని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చెప్పాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను ప్రశ్నించారు. వివరాలు సేకరించి రద్దు చేయడానికి  నివేదికను అందజేస్తామని ఆ శాఖ ఎస్‌ఈ సమాధానమిచ్చారు. వర్షాకాలంలో లీకేజీలను వెంటనే అరికట్టాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా జడ్పీ కార్యాలయ ఆవరణలో చైర్మన్, జడ్పీటీసీలు, సభ్యులు, అధికారులు మొక్కలు నాటారు.  సమావేశంలో జడ్పీటీసీలు భాస్కర్‌రెడ్డి, బాజిరెడ్డి జగన్, అంబర్‌సింగ్, జడ్పీ సీఈవో గోవింద్ పాల్గొన్నారు.                                      logo