బుధవారం 12 ఆగస్టు 2020
Nizamabad - Jul 03, 2020 , 02:57:24

రూ. 32 కోట్లతో బోధన్ - నిజామాబాద్ రహదారి విస్తరణ

రూ. 32 కోట్లతో బోధన్ - నిజామాబాద్ రహదారి విస్తరణ

  • nత్వరలో పనులు ప్రారంభం
  •  nపూర్తికానున్న బాసర రోడ్డు పనులు 
  • nబోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ వెల్లడి 

బోధన్: బోధన్ - నిజామాబాద్ ప్రధాన రహదారి విస్తరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.32 కోట్లు మంజూరుచేసిందని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ తెలిపారు. బోధన్ పట్టణం శక్కర్‌నగర్‌లో రూ.51 లక్షలతో శ్రీ రామ మందిరం నుంచి మసీదు వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బోధన్ - నిజామాబాద్ రహదారి విస్తరణ పనులకు మంజూరైన నిధులతోనే  నాలుగు కల్వర్టుల నిర్మాణ  పనులు కూడా చేపడతామన్నారు. బోధన్ నియోజకవర్గంలోని పలు రోడ్లను ఫోర్‌లేన్‌గా మార్చుతున్నామని చెప్పారు. రూ.50 కోట్లతో కొనసాగుతున్న జాన్కంపేట్ - బాసర రోడ్డు విస్తరణ పనులు త్వరలో పూర్తవుతాయన్నారు. బోధన్ - పెంటాఖుర్దు, పెగడాపల్లి - హంగర్గా రోడ్లను ఫోర్‌లేన్‌గా మార్చుతున్నామని చెప్పారు. బోధన్‌లో బస్టాండ్ పక్క నుంచి సరస్వతీనగర్‌కు వెళ్లే రోడ్డు ఇరుకుగా  ఉండడంతో.. ఆ రోడ్డు విస్తరణ పనులను రూ.కోటితో చేపట్టబోతున్నామని తెలిపారు. ఆరేండ్లలో నియోజకవర్గంలో రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చుచేశామని చెప్పారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు మున్సిపల్ యంత్రాంగం ఎంతో కృషిచేస్తున్నదన్నారు. 

శక్కర్‌నగర్‌కు పూర్వవైభవం

శక్కర్‌నగర్‌కు పూర్వవైభవం తీసుకువస్తామని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. బోధన్ పట్టణంలో అభివృద్ధి పనులపై సమగ్రంగా చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు గురువారం మున్సిపల్ కార్యాలయం లో సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తూము పద్మావతి, వైస్ చైర్మన్ మహ్మద్ ఎత్తేషాం సోయెల్,  కమిషనర్ రామలింగం, జడ్పీ వైస్ చైర్‌పర్సన్ రజితా యాదవ్, జడ్పీటీసీ గిర్దావర్ లక్ష్మి, టీఆర్‌ఎస్ బోధన్ నియోజకవర్గం నాయకులు గిర్దావర్ గంగారెడ్డి, మున్సిపల్ డీఈ ఎ.శివానందం, మున్సిపల్ కౌన్సిలర్లు తూము శరత్‌రెడ్డి, మీర్ నజీర్ అలీ (డబ్బు), కొత్తపల్లి రాధాకృష్ణ, కె.శ్రీకాంత్‌గౌడ్, టీఆర్‌ఎస్ పట్టణ నాయకులు పి.గంగాధర్‌గౌడ్, తోకల గంగారెడ్డి, రవీందర్ యాదవ్, జాడె సతీశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. 


తాజావార్తలు


logo