సోమవారం 26 అక్టోబర్ 2020
Nizamabad - Jul 03, 2020 , 02:57:25

పల్లె పల్లెకో ప్రకృతి వనం

పల్లె పల్లెకో ప్రకృతి వనం

  • lహరిత శోభ సంతరించుకోనున్న పల్లెలు
  • lప్రతి గ్రామంలో పార్కు ఏర్పాటుకు కసరత్తు
  • lమానసిక ఉల్లాసానికి దోహదం
  • lజిల్లాలో 252 గ్రామాల్లో స్థలాల గుర్తింపు

మోర్తాడ్: పట్టణాలంటే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఒక అనుభూతి. పట్టణాలకే పార్కులు పరిమితం అనే అభిప్రా యం ఉండేది. ఇటువంటి పరిస్థితుల్లో గ్రామాలను బలోపేతం చేయడం, స్వచ్ఛ గ్రామాలుగా మార్చడమే లక్ష్యంగా సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం పల్లెల సౌందర్యాన్ని పెంచేందుకు మరో అడుగు వేసింది. గ్రామాల్లోని ప్రజల మానసిక ఉల్లాసానికి ఉపయోగపడే విధంగా, పచ్చద నాన్ని పెంచే విధంగా ప్రతి గ్రామంలో ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్థల సేకరణ తరు వాత గ్రామ పంచాయతీ, ఈజీఎస్ ఆధ్వర్యంలో ప్రకృతి వనం  ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. నిజామాబాద్ జిల్లాలో 530 గ్రామపంచాయతీలకుగాను ఇప్పటి వరకు 252 గ్రామా ల్లో స్థలాలను అధికారులు గుర్తించారు. జిల్లా అధికా రులకు ప్రకృతి వనాల ఏర్పాటుకు సంబంధించిన సూచన లను ప్రభుత్వం జారీ చేసింది.  

స్థల ఎంపిక..

గ్రామంలో ఏర్పాటు చేసే ప్రకృతి వనం కోసం ఎకరం స్థలాన్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన స్థలం గ్రామస్తులందరికి అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. గ్రామపంచాయతీ, ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన స్థలంలో ఎటువంటి ముండ్ల పొదలు లేకుండా చేయాలి. ఎంపిక చేసిన స్థలాన్ని గ్రామపంచాయతీ ట్రాక్టర్ సహాయంతో కల్టివేటర్‌తో దున్నించాలి. ఆ తరువాత గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తయారు చేసిన కంపోస్టును వేయాలి. ఎంపిక చేసిన స్థలంలో జీవామృతం  చల్లాలి. భూమి సారాన్ని పెంచేవిధంగా చర్యలు చేపట్టాలి. 

మూడు వరుసల్లో మొక్కలు నాటాలి..

ప్రకృతి వనం కోసం ఎంపిక చేసిన స్థలంలో బౌండరీ వద్ద మూడు వరుసల్లో మొక్కలు నాటాల్సి ఉంటుంది. మొదట ఏపుగా పెద్దగా పెరిగే మొక్కలు, మధ్యవరుసలో మీడియం సైజ్ మొక్కలను నాటాల్సి ఉంటుంది. ఈ రెండు వరుసల్లో వేప, గుల్మోహర్, రెయిన్‌ట్రీ, రావి,  కానుగ, పెల్టోఫోరమ్, బాదాం తదితర మొక్కలను నాటాలి. మొక్కలను నాటేందుకు అటవీశాఖ సిబ్బంది సూచనలు తీసుకోవడం మంచిది. ఇక ఇన్నర్ సైడ్ పూల మొక్కలు  నాటాలి. గన్నేరు, టెకోమా, బోగన్‌వాలా, మందారతో పాటు, ఈత, హెన్నా, సీతాఫలం, దానిమ్మ, జామ, కరివేపాకు, మల్బరీ, వెదురు, జమ్మి, వావిల్లి మొక్కలను పెంచుకోవచ్చు.

జిల్లాలో 252 గ్రామాల్లో స్థలాల ఎంపిక

ప్రతి గ్రామంలో ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇప్పటి వరకు జిల్లాలో 530 పంచాయతీలకు గాను 252 గ్రామపంచాయతీల్లో అధికారులు స్థలాన్ని ఎంపిక చేశారు. 

వాకర్స్ ట్రాక్ కోసం..

గ్రామాల్లో కూడా ప్రస్తుతం మార్నింగ్‌వాక్, ఈవినింగ్ వాక్ చేస్తున్న వారు ఉండడంతోఅటువంటి వారికోసం మూడు వరుసల చెట్ల తరువాత మొ రంతో వాకింగ్ కోసం ట్రాక్ నిర్మించాలి. ట్రాక్ వెంట  సేద తీరేందుకు మూడు, నాలుగు బెంచీలను ఏర్పాటు చేయించాలి. 

మధ్యలో నీడనిచ్చే చెట్లు..

ఎకరం స్థలంలో పార్కు ఏర్పాటులో భాగంగా వాకింగ్ కోసం ఏర్పాటు చేసిన ట్రాక్ మధ్యలో ఉన్న స్థలంలో ఎక్కువగా నీడనిచ్చే చెట్లను పెంచా లి. ఎకరం భూమిలో దాదాపు 4000 చెట్లు పెరిగేలా చూడాల్సి ఉంటుంది. మధ్యభాగంలో నీడ కోసం చింత, ఉసిరి, నేరేడు, వేప, వెలుగ, ఇప్ప, సాండల్‌వుడ్, రేగు, కుంకుడు, పనస, సీమచింత, నెమిలినార లాంటి చెట్లను పెంచాలి. అయితే  గ్రామ పరిసరాల్లో ఏ చెట్లు బాగా పెరుగుతాయి, గ్రామ అవసరాల కోసం ఉపయోగపడే చెట్లను పెంచుకోవచ్చు. నీడ నిచ్చే చెట్ల కింద భాగంలో గార్డెనింగ్ ఏర్పాటు చేయడంతో ఈ వనాలకు ఎవరు వచ్చినా ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు చేసినట్లవుతుంది. 

అవసరాలను బట్టి ఏర్పాటు..

గ్రామాల్లో ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ ఆలోచనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. అయితే ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు గ్రామంలో దాతలు, నిత్యం వాకింగ్‌కు వచ్చేవారు, ఆహ్లాద వాతావరణాన్ని కోరుకునే వారి సహకారంతో గ్రామ ప్ర జల అవసరాలను బట్టి మరింత సుందరంగా పార్కును తీర్చిదిద్దుకోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఏర్పాటు చేసే ప్రకృతి వనం గ్రామపంచాయతీ, ఈజీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతాయి. 


మండలాల వారీగా ప్రకృతి వనాల కోసం ఎంపిక చేసిన స్థలాల వివరాలు

మండలం జీపీలుస్థలం ఎంపిక చేసిన 

గ్రామాలు

ఆర్మూర్ 18 13

బాల్కొండ 10 09

భీమ్‌గల్ 27 09

జక్రాన్‌పల్లి 21 10

కమ్మర్‌పల్లి 14 10

మెండోరా 11 01

మోర్తాడ్ 10 05

ముప్కాల్ 07 05

నందిపేట్ 33 33

వేల్పూర్ 18 01

ఏర్గట్ల 08 05

బోధన్ 38 13

చందూర్ 05 03

కోటగిరి 28 11

మోస్రా 05 03

రెంజల్ 17 00

రుద్రూర్ 10 00

వర్ని 22 02

ఎడపల్లి 17 07

ధర్పల్లి 22 10

డిచ్‌పల్లి 34 21

ఇందల్వాయి 23 11

మాక్లూర్ 30 21

మోపాల్ 21 10

నవీపేట్ 32 14

నిజామాబాద్ 19 11

సిరికొండ 30 14


logo