మంగళవారం 11 ఆగస్టు 2020
Nizamabad - Jul 02, 2020 , 03:40:58

వందశాతం మొక్కలు నాటాలి నిజామాబాద్ జడ్పీ చైర్మన్

వందశాతం మొక్కలు నాటాలి  నిజామాబాద్ జడ్పీ చైర్మన్

  • దాదన్నగారి విఠల్‌రావు

నిజామాబాద్ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో లక్ష్యానికి అనుగుణంగా అన్ని ప్ర భుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల వ ద్ద మొక్కలను నాటాలని నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు సూ చించారు. జడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో భాగంగా రెండోరోజు బుధవారం  విద్య, వై ద్యం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలపై చర్చించా రు. పాఠశాలల సమస్యలపై ప్రజాప్రతినిధు లు ఫోన్‌చేస్తే డీఈవో స్పందించడం లేదని పలువురు సభ్యులు చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన చైర్మన్ జిల్లాలోని ప్రజాప్రతినిధులందరి ఫోన్ నంబర్లు తీసుకొని వారు కాల్ చేసినప్పుడు స్పం దించాలని డీఈవో జనార్దన్‌రావును ఆ దేశించారు. వైద్యశాఖపై జరిగిన చర్చలో..  జిల్లా కేంద్ర దవాఖానలో ఏర్పా టు చేసిన కొవిడ్-19 ల్యాబ్‌లో  టెస్టులు ప్రారంభించారా? అని సంబంధిత ఆర్‌ఎంవోను ప్రశ్నించగా.. లక్షణాలు ఉన్న వారికి మాత్రమే పరీక్షలు చేస్తున్నామని సమాధానం చెప్పారు. వానకాలంలో పాము, తేలుకాటు కేసులు నమో దయ్యే అవకాశం ఉందని, అన్ని పీహెచ్‌సీల్లో మందులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో సుదర్శన్‌ను ఆదేశించారు.  సమావేశంలో జడ్పీటీసీలు సుమనారెడ్డి, భారతి, గంగాధర్, శంకర్, యమున, బానోత్ కమల, రాజేశ్వర్, జడ్పీ సీఈవో గోవింద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.  logo