మంగళవారం 11 ఆగస్టు 2020
Nizamabad - Jul 02, 2020 , 03:40:58

మాజీ ఎంపీ కవిత చొరవతో

మాజీ ఎంపీ కవిత చొరవతో

  • స్వగ్రామానికి చేరిన క్యాన్సర్ బాధితుడు 

ఖలీల్‌వాడి : దుబాయ్‌లో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన చిన్నారెడ్డి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సహకారంతో బుధవా రం స్వగ్రామానికి చేరుకున్నాడు. మోపాల్ మండలం బోర్గాం గ్రామానికి చెందిన చిన్నారెడ్డికి గత ఏడాది డిసెంబర్‌లో క్యాన్సర్ ఆపరేషన్ జరిగింది. కంపెనీ నుంచి తనకు రావాల్సిన డబ్బులు తెచ్చుకోవడానికి మూడు నెలలక్రితం దుబాయ్ వెళ్లాడు. 15 రోజులకు సరిపడా మందులు మాత్రమే తీసుకెళ్లిన చిన్నారెడ్డికి లాక్‌డౌన్‌తో కష్టాలు మొదలయ్యాయి. దుబాయ్‌లో మందులు దొరక్క, కీమోథెరపీ జరగక తీవ్రఇబ్బందులు పడ్డాడు. ఆరోగ్యం క్షీణించడంతో తనను ఆదుకోవాలని  చిన్నారెడ్డి సోషల్ మీడియా ద్వారా మాజీ ఎంపీ కవితను కోరాడు. కుటుంబసభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ సైతం ఈ విషయమై కవితను సంప్రదించగా, ఆమె తక్షణమే స్పందించి దుబాయ్‌లోని ఈటీసీయే నాయకుడు కిరణ్‌తో మాట్లాడారు. కిరణ్ విమాన టిక్కెట్ ఇప్పించడంతో చిన్నారెడ్డి బుధవారం శంషాబాద్‌కు చేరుకున్నాడు. జాగృతి ప్రధానకార్యదర్శి  నవీన్‌ఆచారి ఎయిర్‌పోర్టుకు చేరుకొని చిన్నారెడ్డి స్వగ్రామం వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.  జాగృతి నాయకుల వినతి మేరకు చిన్నారెడ్డిని హోంక్వారంటైన్‌లో ఉండేందుకు అధికారులు అనుమతించారు. అడిగిన వెంటనే స్పందించి, ఇండియాకు వచ్చేందుకు సహకరించిన మాజీ ఎంపీ కవితకు చిన్నారెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారెడ్డిని బుధవారం నవీన్‌ఆచారితోపాటు జాగృతి జిల్లా కన్వీనర్ అవంతి కుమార్, రాష్ట్ర కార్యదర్శులు లక్ష్మీనారాయణ భరద్వాజ్, నరాల సుధాకర్ తదితరులు పరామర్శించారు.   logo