శనివారం 04 జూలై 2020
Nizamabad - Jul 01, 2020 , 03:27:41

సంక్షేమ పథకాలు పక్కాగా అమలు చేయాలి

సంక్షేమ పథకాలు పక్కాగా అమలు చేయాలి

  •  హరితహారంలో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలి 
  •  స్థాయీ సంఘం సమావేశంలో నిజామాబాద్‌ జడ్పీ చైర్మన్‌ దాదాన్నగారివిఠల్‌రావు

నిజామాబాద్‌ సిటీ :  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా అధికారులు కృషి చేయాలని నిజామాబాద్‌ జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. జడ్పీ కార్యాలయంలో మంగళవారం స్థాయీ సంఘ సమావేశం నిర్వహించారు. ముందు గా  మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి సమావేశాన్ని ప్రారంభించారు. మొదటి రోజు పంచాయతీరాజ్‌, మైనింగ్‌, సివిల్‌ సప్లయ్‌, డీఆర్డీఏ, వ్యవసాయ అనుబంధ శాఖలు, ఉపాధి హామీ, పరిశ్రమలపై సమీక్ష కొనసాగింది.  ఈ సందర్భంగా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మాట్లాడుతూ జూన్‌ మాసంలో జిల్లాలోని 751 రేషన్‌ దుకాణాల్లో ఈ-పాస్‌ యంత్రాల ద్వారా80.19 శాతం మంది లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేశామన్నారు. గత సీజన్‌లో రైతుల నుంచి 5,18,255.240 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రూ.950.89 కోట్లతో కొనుగోలు చేసి వంద శాతం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. జిల్లా పంచాయతీ శాఖ అధికారిణి జయసుధ మా ట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తగా జూన్‌ ఒకటో తేదీ నుంచి  8వ తేదీ వరకు చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో విజయవంతంగా పూర్తి చేశామన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్‌ కొనుగోలు చేశామని, ఇందులో 440 ట్రాలీలు, 473ట్యాంకర్లు ఉన్నాయన్నారు. మిగతా  పంచాయతీల్లో  ట్రాలీలు, ట్రాక్టర్లు, ట్యాంకర్లు కొనుగోలు చేయడానికి ఆర్డర్‌ చేశామన్నారు. అనంతరం జడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు ఇసుక, మొరం క్వారీలకు అనుమతులు జారీ చేయాలని మైనింగ్‌ శాఖ ఏడీ సత్యనారాయణను ఆదేశించారు. రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. సమావేశంలో  వైస్‌ చైర్‌పర్సన్‌ రజితాయాదవ్‌, జడ్పీటీసీలు సుమలత, మాన్‌సింగ్‌, నారోజి గంగారాం, కో ఆప్షన్‌ సభ్యుడు మోయిజ్‌, జడ్పీ సీఈవో గోవిందు తదితరులు పాల్గొన్నారు. logo