శనివారం 04 జూలై 2020
Nizamabad - Jul 01, 2020 , 03:27:42

పోలీస్‌ బందోబస్తు నడుమ చేపల వేట

పోలీస్‌ బందోబస్తు నడుమ చేపల వేట

నందిపేట్‌ రూరల్‌ : నందిపేట్‌ మండలం కౌల్‌పూర్‌ గ్రామ చెరువులో మంగళవారం కూడా పోలీసు బందోబస్తు నడుమ మత్స్యకారులు చేపల వేట కొనసాగించారు. ఆర్మూర్‌ రూరల్‌ సీఐ విజయ్‌కుమార్‌, ఎస్సై శోభన్‌బాబు ఆధ్వర్యంలో  బందోబస్తు ఏర్పాటుచేశారు. గతంలో కౌల్‌పూర్‌ గ్రామం వెల్మల్‌ జీపీ పరిధిలో అనుబంధ గ్రామంగా ఉండేది. వెల్మల్‌ మత్స్యకారులు గ్రామంలోని మూడు చెరువులతో పాటు కౌల్‌పూర్‌ గ్రామ చెరువులో కూడా చేపలు పట్టుకుని జీవనం సాగిస్తున్నారు. గతేడాది కౌల్‌పూర్‌ ప్రత్యేక జీపీగా ఏర్పడడంతో వెల్మల్‌ మత్స్యకారులు తమ గ్రామ చెరువులో చేపలు పట్టవద్దంటూ కౌల్‌పూర్‌వాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వెల్మల్‌ మత్స్యకారులు హైకోర్టును ఆశ్రయించారు. కౌల్‌పూర్‌ గ్రామ చెరువులో వెల్మల్‌ మత్స్యకారులు చేపలు పట్టుకోవచ్చని, వారికి రక్షణ కల్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో రెండు రోజులుగా  రక్షణ కల్పిస్తున్నట్లు  ఆర్మూర్‌ సీఐ విజయ్‌కుమార్‌ తెలిపారు.    logo