సోమవారం 06 జూలై 2020
Nizamabad - Jun 30, 2020 , 02:35:26

కండ్లు తెరవని పసికూనకు కంత్రీ కరోనా..!

కండ్లు తెరవని పసికూనకు కంత్రీ కరోనా..!

  • l మొన్న తల్లికి.. నిన్న శిశువుకు పాజిటివ్ నిర్ధారణ 
  • l కామారెడ్డి జిల్లాలో మరో మూడు కేసులు 
  • l ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన 
  • విద్యానగర్ : పుట్టిన మగశిశువుకు ఒక్క రోజులోనే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కామారెడ్డి జిల్లా జంగంపల్లికి చెందిన ఓ గర్భిణికి ఆదివారం కొవిడ్-19 నిర్ధారణ కాగా అదే రోజు ఆమెకు జన్మించిన శిశువుకు సోమవారం కరోనా పాజిటివ్ అని తేలింది. కామారెడ్డి జిల్లాలో సోమవారం మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్ కాలనీకి చెందిన ఒకరికి, భిక్కనూరు, రాజంపేట గ్రామాలకు చెందిన ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 55 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, అందులో 38 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. ప్రజలు మరికొన్ని రో జులు ప్రయాణాలు, శుభకార్యాలు మానుకోవాలని, భౌతికదూరం పాటించాలని, మాస్కులు ధరించాలని డీ ఎంహెచ్ సూచించారు.  

బాకర్ ఒకరికి కరోనా పాజిటివ్.. 

కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో ని హెగ్డోలి గ్రామ పంచాయతీ పరిధిలోని బాకర్ చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అ య్యింది. గ్రామానికి చెందిన సదరు వ్యక్తి ఈనెల 25వ తేదీన శస్త్రచికిత్స నిమిత్తం హైదరాబాద్ ఓ దవాఖానలో అడ్మిట్ అయ్యాడు. అక్కడి వైద్యులు ఆపరేషన్ అవసరమైన పరీక్షలను ని ర్వహించడంతో పాటు రక్త నమూనాలను కరోనా నిర్ధారణ కోసం పంపించారు. ఆపరేషన్ తర్వాత చేస్తామ ని చెప్పడంతో అతడు ఈ నెల 27న ఇంటికి చేరుకున్నాడు. అతడికి 28వ తేదీ న కరోనా పాజిటివ్ నిర్ధార ణ అయ్యిందని స్థానిక మండల వైద్యులు తెలిపా రు. వెంటనే మండల వైద్యాధికారులు గ్రామానికి చేరుకొని తగు సూచనలు అందజేశారు. 14 రోజుల పాటు హోం క్వారంటైన్ ఉండాలని సదరు వ్యక్తికి డాక్టర్ సమత సూచించారు. అతడితో ప్రైమరీ కాంటాక్ట్ అయిన వారి వివవాలను సేకరించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను గ్రామస్తులకు వివరించారు. సర్పంచ్ వెంకాగౌడ్, ఎస్సై మచ్చేందర్ ఎంపీడీవో మహ్మద్ అతారుద్దీన్, సూపర్ కృష్ణవేణి, జ్యోతి, ఏఎన్ విజయ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 

బిచ్కుందలో వివరాల సేకరణ

బిచ్కుంద : బిచ్కుందలోని ఓ చెప్పుల దుకాణం యజమానికి కరోనా వ్యాధి సోకిన విషయం తెలిసిందే. అతడిని కలిసిన వారి వివరాలను ఆరోగ్యశాఖ సేకరించింది. దుకాణంలో పనిచేస్తున్న నలుగురు కార్మికుల శాంపిళ్లను సేకరించేందుకు బాన్సువాడ ప్రభుత్వ దవాఖానకు సోమవారం తరలించారు. నలుగురు హోం క్వారంటైన్ ఉండాలని వైద్యాధికారులు తెలిపారు. 

రాజంపేటలో నలుగురికి హోం క్వారంటైన్.. 

రాజంపేట : రాజంపేటలో ఓ మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గ్రామానికి చెందిన సదరు మహిళ కాలుకు 20 రోజుల క్రితం గాయం కావడంతో కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు వెళ్లింది. పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఉస్మానియా దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమెకు ఆపరేషన్ చేయాలని ఈనెల 26వ తేదీన రక్త నమూనాలను సేకరించారు. వాటి రిపోర్టులు సోమవారం రాగా.. కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే స్థానిక వైద్యాధికారులు రాజంపేట గ్రామానికి వెళ్లి ఆమె కుటుంబసభ్యులు నలుగురికి హోం క్వారంటైన్ ఉండాలని సూచించారు. 


logo